Student Harish: హన్మకొండ పేపర్ లీకేజ్.. హోల్డ్‌లో విద్యార్థి హరీష్ రిజల్ట్స్

ABN , First Publish Date - 2023-05-10T15:31:04+05:30 IST

హన్మకొండ హిందీ పేపర్ లీకేజ్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న విద్యార్థి హరీష్‌ ఫలితాలను అధికారులు హోల్డ్‌లో పెట్టారు.

Student Harish: హన్మకొండ పేపర్ లీకేజ్.. హోల్డ్‌లో విద్యార్థి హరీష్ రిజల్ట్స్

హైదరాబాద్: హన్మకొండ హిందీ పేపర్ లీకేజ్ కేసులో (Tenth paper Leakage Case) ఆరోపణలు ఎదుర్కున్న విద్యార్థి హరీష్‌ (Student Harish) ఫలితాలను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. 10వ తరగతి పరీక్ష జరుగుతున్న సమయంలో హనుమకొండలో హిందీ పేపర్ లీకేజ్ కలకలం రేపింది. కొందరు నిందితులు హనుమకొండ స్కూల్‌లో విద్యార్థి హరీష్ వద్ద పరీక్ష పేపర్ ఫోటో తీసుకుని వాట్సప్‌లో పెట్టిన విషయం తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే హరీష్‌ను డీబార్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ విషయంపై హరీష్‌ కోర్టుకు వెళ్లగా.. కోర్టు ఆదేశాలతో తిరిగి పరీక్షలు రాశాడు. కాగా.. ఈరోజు పదో తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra Reddy)విడుదల చేశారు. అయితే విద్యార్థి హరీష్ ఫలితం ప్రకటించకుండా అధికారులు హోల్డ్‌‌లో పెట్టారు. హరీష్ రిజల్ట్స్ ప్రకటించాలంటూ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఎన్‌ఎస్‌యూఐ నేతలు కలిసి వినతి చేశారు.

కాగా.. హన్మకొండలో పదో తరగతి హిందీ పేపర్ లీకేజ్ హాట్ టాపిక్‌గా నిలిచింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా... విద్యార్థి హరీష్‌ వద్ద నుంచి పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. దీంతో అధికారులు విద్యార్థిని ఐదేళ్ల పాటు డీబార్ చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారుల నిర్ణయంతో విద్యార్థి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తనకేమీ తెలియదంటూ మీడియా ముందు వాపోయాడు. తాను పరీక్ష రాస్తున్న సమయంలో కిటీకీ వద్దకు ఓ వ్యక్తి వచ్చి బలవంతంగా తన పేపర్ తీసుకుని ఫోటో తీశాడని.. ఎవరీకీ చెప్పొద్దంటూ బెదిరించాడని ఆవేదన చెందాడు. ఎవరో చేసిన తప్పుకు తాను బలయ్యానన్నారు. అయితే డీబార్ చేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హరీష్ కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు హరీష్‌ను పరీక్షలకు అనుమతిస్తూ ఆదేశాలు చేసింది. కోర్టు అనుమతితో విద్యార్థి హరీష్ మిగిలిన పరీక్షలను పూర్తి చేశాడు. అయితే ఈరోజు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కాగా హరీష్ రిజల్ట్స్‌ను అధికారులు హోల్డ్‌లో పెట్టాడు. దీంతో విద్యార్థి హరీష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. తన రిజల్ట్స్ విడుదల చేయాలని కోరుతున్నాడు. ఈ క్రమంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.

Updated Date - 2023-05-10T15:31:04+05:30 IST