BRS : ఒకటే ఉత్కంఠ.. కవిత నివాసానికి బీఆర్ఎస్ నేతల క్యూ..

ABN , First Publish Date - 2023-08-21T11:00:19+05:30 IST

టికెట్ల కోసం బీఆర్ఎస్ నేతల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత వద్దకు నేతలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవితతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహుల వరుసగా భేటీ అవుతున్నారు.

BRS : ఒకటే ఉత్కంఠ.. కవిత నివాసానికి బీఆర్ఎస్ నేతల క్యూ..

హైదరాబాద్ : టికెట్ల కోసం బీఆర్ఎస్ నేతల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత వద్దకు నేతలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవితతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహుల వరుసగా భేటీ అవుతున్నారు. ఈ రోజు టిక్కెట్ల ప్రకటన ఉంటుందన్న సమాచారం నేపథ్యంలో చివరి ప్రయత్నాల్లో నేతలు ఉన్నారు. నిన్న కవితని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ కలిశారు. ఉద్యమ కారులకు టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇక నేడు ఉదయం 6 గంటల నుంచే కవిత నివాసానికి నేతలు క్యూ కట్టారు. ఈ రోజు కవితని ఖానాపూర్ ఎమ్మేల్యే రేఖ నాయక్ కలిశారు. తనకే టికెట్ మరోమారు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇల్లందు, సంగారెడ్డి, స్టేషన్ ఘనపూర్ నేతలు హరీష్ రావును కలిశారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మా రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు కవితను కలిశారు. అలాగే కవితతో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ సైతం భేటీ అయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలు భేటీ అయ్యారు.

Updated Date - 2023-08-21T11:00:19+05:30 IST