Share News

Hyderabad CP: హైదరాబాద్‌ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థత

ABN , First Publish Date - 2023-11-20T16:16:27+05:30 IST

హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

Hyderabad CP:  హైదరాబాద్‌ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థత

హైదరాబాద్: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య (Hyderabad CP Sandeep Shandilya) అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి (Apollo Hospital) తరలించి చికిత్స అందజేస్తున్నారు. సోమవారం బషీర్‌‌బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఉండగా సీపీ సందీప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గుర్తించిన అధికారులు సీపీని హుటాహుటిన హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అపోలో వైద్యులు సీపీకి చికిత్స అందజేస్తున్నారు. మరికొద్దిసేపట్లో సీపీ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది.

Updated Date - 2023-11-20T16:19:42+05:30 IST