Hyderabad: బరువు తగ్గిస్తామని అనగానే పొలోమని వెళ్లకండి.. అలా చెప్పే.. ఎంత బేవర్స్ పని చేశాడో చూడండి..!

ABN , First Publish Date - 2023-05-04T17:12:43+05:30 IST

వెల్‌నెస్‌ కేంద్రానికి బరువు తగ్గేందుకు వచ్చే మహిళల్ని ట్రాప్‌ చేసి అశ్లీలంగా వీడియో కాల్స్‌ రికార్డ్స్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్‌..

Hyderabad: బరువు తగ్గిస్తామని అనగానే పొలోమని వెళ్లకండి.. అలా చెప్పే.. ఎంత బేవర్స్ పని చేశాడో చూడండి..!

హైదర్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి): వెల్‌నెస్‌ కేంద్రానికి (Wellness Centre) బరువు తగ్గేందుకు (Weight Loss) వచ్చే మహిళల్ని ట్రాప్‌ చేసి అశ్లీలంగా వీడియో కాల్స్‌ రికార్డ్స్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు (KPHB Police) అరెస్ట్‌ చేశారు. విజయవాడకు చెందిన వక్కలపాటి చంద్రశేఖర్‌ (40) కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్‌లోని హెర్బాలైఫ్‌ కంపెనీ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ మేనేజర్‌. ఆ ఉత్పత్తులతో బరువు తగ్గించుకునేందుకు తన వద్దకు వచ్చే పలువురు మహిళల ఫోన్‌ నెంబర్లు, వ్యక్తిగత వివరాలు సేకరించి వారికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించేవాడు. మరికొందరిని నమ్మించి వీడియో కాల్స్‌ మాట్లాడుతూ వివస్త్రలుగా చేయించి వాటిని రికార్డ్‌ చేసేవాడు. ఈ విధంగా ఓ మహిళను వేధిస్తూ, బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతుండటంతో కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మంగళవారం చంద్రశేఖర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

గతంలో చంద్రశేఖర్‌ రాయదుర్గం పరిధిలో ఓ మహిళను ట్రాప్‌ చేసి వీడియోకాల్స్‌తో లొంగదీసుకొని, రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆమెపై హత్యాయత్నానికి పాల్పడటంతో పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. చంద్రశేఖర్‌ వల్ల అనేకమంది మహిళలు మోసపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మహిళలు కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు పంచుకోవటం, న్యూడ్‌కాల్స్‌ మాట్లాడటం తగదని కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌కుమార్‌ సూచించారు.

Updated Date - 2023-05-04T17:42:00+05:30 IST