Share News

America: అనుకోకుండా ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్ఆర్ఐ

ABN , First Publish Date - 2023-11-30T11:44:52+05:30 IST

అమెరికాలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ స్టాంపింగ్‌కు వచ్చిన ఓ ఎన్‌ఆర్‌ఐ అనుకోకుండా ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ డి.డి. కాలనీకి చెందిన అవినాష్ మల్లం నార్త్ కరోలినాలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నారు.

America: అనుకోకుండా ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్ఆర్ఐ

Telangana Elections: అమెరికాలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ స్టాంపింగ్‌కు వచ్చిన ఓ ఎన్‌ఆర్‌ఐ అనుకోకుండా ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ డి.డి. కాలనీకి చెందిన అవినాష్ మల్లం నార్త్ కరోలినాలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నారు. అమెరికా నిబంధనల ప్రకారం హెచ్ వన్ వీసా పొందిన వారు అప్పుడప్పుడు స్టాంపింగ్‌కు రావాల్సి ఉంటుంది. ఈ దఫా స్లాట్ నవంబర్ 30న దొరికింది. కొద్ది నెలల క్రితం ఈ స్లాట్ బుక్ చేసుకున్నారు. అప్పటికి ఎన్నికల తేదీ నిర్దారణ కాలేదు. అయితే అనుకోకుండా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఇదే రోజు రావడంతో తనకు ఇక్కడ ఉన్న ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కలిగింది. ఒకే రోజు అటు స్టాంపింగ్ పూర్తి చేసుకోవడం, ఇటు ఓటు హక్కును వినియోగించుకోవడం అరుదైన అవకాశమే అని చెప్పొచ్చు.

Updated Date - 2023-11-30T11:44:54+05:30 IST