Rahul Sipliganj: ఆస్కార్‌ వేదికపై అదరగొట్టిన రాహుల్‌ సిప్లిగంజ్..అతని కోసం స్నేహితులు ఏం చేయబోతున్నారో తెలుసా?

ABN , First Publish Date - 2023-03-14T12:37:33+05:30 IST

రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj).. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన టాలెంటెడ్ గాయ్.. ధూల్‌పేట్‌లో పుట్టిన ఈ సామాన్యుడు ఏకంగా ప్రపంచప్రఖ్యాత ఆస్కార్ (Oscar for Naatu Naatu song) స్టేజీపై అదరగొట్టాడు..

Rahul Sipliganj: ఆస్కార్‌ వేదికపై అదరగొట్టిన రాహుల్‌ సిప్లిగంజ్..అతని కోసం స్నేహితులు ఏం చేయబోతున్నారో తెలుసా?

హైదరాబాద్‌: రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj).. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన టాలెంటెడ్ గాయ్.. ధూల్‌పేట్‌లో పుట్టిన ఈ సామాన్యుడు ఏకంగా ప్రపంచప్రఖ్యాత ఆస్కార్ (Oscar for Naatu Naatu song) స్టేజీపై అదరగొట్టాడు.. ప్రపంచ స్థాయి మ్యూజిక్ ప్రియులను అలరించాడు.. పాటను పాడడం.. మామూలు విషయం కాదు. కానీ ఒకప్పుడు ఇదే రాహుల్ తన పేరు కనీసం పది మందికైనా తెలియాలని ఎంతో ఆరాటపడ్డాడు. ఎన్నో కష్టాల్ని దాటుకుంటూ.. ఏడు సముద్రాలు దాటి ఏకంగా ఆస్కార్ స్టేజీపైనే పాడి అబ్బురపరిచాడు.

కాలేజీ బుల్లోడా.. ఖలేజా ఉన్నోడా.. స్టూడెంట్‌ కుర్రోడా.. టాలెంట్‌ ఉన్నోడా..అంటూ గాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి తన టాలెంట్‌(Talent)తో ఆస్కార్‌ వేదిక(Oscar venue) పై లైవ్‌ ఫెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చే స్థాయికి ఎదిగాడు..ధూల్‌పేట్‌(Dhulpet) కుర్రోడు రాహుల్‌ సిప్లిగంజ్‌(Rahul Sipliganj). దమ్ము సినిమాలోని ‘వాస్తు బాగుందే’ పాటతో దుమ్ము లేపిన రాహుల్‌కు ‘నాటు నాటు’ పాటతో మళ్లీ కీరవాణి చాన్స్‌ ఇవ్వడం ద్వారా ‘పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు..’ అంటూ డాల్బీ థియేటర్‌లో తన గళం వినిపించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమాలో తను పాడిన పాట ఆస్కార్‌కు ఎంపిక కావడం, అదే వేదికపై లైవ్‌ ఫెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వడంతో రాహుల్‌ పుట్టి పెరిగిన ధూల్‌పేట్‌, మంగళ్‌హాట్‌ బస్తీల్లో సంబరాలు ఆకాశాన్నంటాయి. ‘అరె చిచా.. అదరగొట్టుండు..’ అని స్నేహితులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

వేడుకలకు ఏర్పాట్లు

రాహుల్‌ నగరానికి చేరుకున్న తర్వాత భారీస్థాయిలో వేడుకలు నిర్వహించేందుకు స్నేహితులు ప్లాన్‌ చేస్తున్నారు. రాహుల్‌ ఖ్యాతి గురించి సోషల్‌ మీడియాలో పరస్పర షేరింగ్‌ చేస్తూ గర్వంగా చాటి చెబుతున్నారు. గల్లీస్థాయి నుంచి బ్లాక్‌బస్టర్‌ పాటలు పాడి సినీ ప్రముఖులనే మైమరిపించాడని కొనియాడారు. ఆస్కార్‌ వేదికపై రాహుల్‌ ఫెర్‌ఫార్మెన్స్‌ ఎంతో గొప్ప అనుభూతి అని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుమారుడిని చూసి ఎంతగా ఉప్పొంగిపోతున్నామో మాటల్లో చెప్పలేక పోతున్నామని తండ్రి రాజ్‌కుమార్‌ భావోద్వేగానికి గురయ్యారు. తన టాలెంట్‌కు మెరుగులు దిద్ది మరింత రాణించాలని ఆకాంక్షించారు.

గల్లీస్థాయి నుంచి బ్లాక్‌బస్టర్‌ పాటలు పాడి సినీ ప్రముఖులనే మైమరిపించాడు. యూట్యూబ్‌ వీడియోల నుంచి మొదలైన రాహుల్ విజయ భేరి.. ఆ తర్వాత సినిమా పాటలు, బిగ్‌బాస్‌ తెలుగులో టైటిల్ విన్నర్‌గా విజయం. ఇప్పుడు ఏకంగా తాను పాడిన పాటకు ఆస్కార్ రావడం.. వీటి అన్నింటి వెనుకు పెద్ద కష్టమే ఉంది.

రాహుల్ తండ్రి ఓ సాదారణ బార్బర్‌. దీంతో పాటలు పాడాలన్న.. వీడియోలే చేయాలన్న చేతిలో డబ్బులు ఉండేవి కావు. ఎన్నో నిద్రలేని రాత్రులూ, ఆరాటాలు, పోరాటాల నడుమ ఫ్రెండ్స్ సాయంతో యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. చిన్న చిన్నగా ప్రచారం పొందుతూ.. ప్రస్తుతం ఈ స్టేజీకు చేరుకున్నాడు.

Updated Date - 2023-03-14T12:37:51+05:30 IST