Share News

Makkan Singh: అందరి చూపు రామగుండం ఎమ్మెల్యే వైపే.. అసెంబ్లీకి ఎలా వచ్చారంటే?

ABN , First Publish Date - 2023-12-09T11:08:43+05:30 IST

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో సమావేశంకానున్నాయి. నూతన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీకీ కొత్తగా ఎన్నికైన రామగుండం ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ న్యూ లుక్‌లో అసెంబ్లీకి వచ్చారు.

Makkan Singh: అందరి చూపు రామగుండం ఎమ్మెల్యే వైపే.. అసెంబ్లీకి ఎలా వచ్చారంటే?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో మొదలుకానున్నాయి. నూతన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీకీ కొత్తగా ఎన్నికైన రామగుండం ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ (Ramagundam MLA Mkkann Singh Raj Thakur) న్యూ లుక్‌లో అసెంబ్లీకి వచ్చారు. తట్ట చెమ్మస్‌తో పాటు బ్లూ కలర్ డ్రెస్‌తో ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చారు. తాను సింగరేణి కార్మికుడినని గుర్తు చేస్తూ ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చారు. రామగుండం ఎమ్మెల్యేతో పాటు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవిర్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. సింగరేణి కార్మికుడి డ్రెస్‌లో వచ్చిన రామగుండం ఎమ్మెల్యేను అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Updated Date - 2023-12-09T11:08:45+05:30 IST