Apsara Case : తన కొడుకుని అప్సర అన్నా అని పిలిచేదంటూ ఆశ్చర్యకర విషయాలు వెల్లడించిన సాయికృష్ణ తండ్రి

ABN , First Publish Date - 2023-06-10T13:51:55+05:30 IST

మూడు నెలల నుంచి అప్సర తన కొడుకుని వేధిస్తోందని పూజారి సాయి కృష్ణ తండ్రి మీడియాకు తెలిపారు. సాయికృష్ణ, అప్సరలకు సంబంధించిన పలు విషయాలను సాయికృష్ణ తండ్రి వెల్లడించారు. పిల్లలు ఉన్నా పెళ్లి చేసుకోవాలని తన అబ్బాయిని ఇబ్బంది పెట్టిందన్నారు. దీంతో సాయి కృష్ణ ఏం చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నాడన్నారు.

Apsara Case : తన కొడుకుని అప్సర అన్నా అని పిలిచేదంటూ ఆశ్చర్యకర విషయాలు వెల్లడించిన సాయికృష్ణ తండ్రి

హైదరాబాద్ : మూడు నెలల నుంచి అప్సర తన కొడుకుని వేధిస్తోందని పూజారి సాయి కృష్ణ తండ్రి మీడియాకు తెలిపారు. సాయికృష్ణ, అప్సరలకు సంబంధించిన పలు విషయాలను సాయికృష్ణ తండ్రి వెల్లడించారు. పిల్లలు ఉన్నా పెళ్లి చేసుకోవాలని తన అబ్బాయిని ఇబ్బంది పెట్టిందన్నారు. దీంతో సాయి కృష్ణ ఏం చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నాడన్నారు. అమ్మాయి వేధించే విషయం తమకు ముందే తెలిసి ఉంటే.. పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇప్పించేవాళ్ళమన్నారు. సాయి కృష్ణ అప్సర ఇంటికి వెళ్తున్నాడన్న విషయం తెలిస్తే ముందే మందలించేవాడినన్నారు.

అప్సర చాలా మందితో సన్నిహితంగా ఉంటోందన్నారు. సాయి కృష్ణను అన్నా అని పిలిచేదని.. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఎలా వచ్చిందని సాయికృష్ణ తండ్రి ప్రశ్నించారు. సాయి కృష్ణ విషయంలో అప్సర తప్పు కూడా ఉందన్నారు. అప్సరను కట్టడి చేయడంలో ఆమె తల్లి కూడా విఫలమైందన్నారు. అప్సరను ఆమె తల్లే తన కుమారుడి మీదకు ఉసిగొలిపిందన్నారు. అప్సరను మా అబ్బాయి హత్య చేశాడని తాను చెప్పలేనని సాయికృష్ణ తండ్రి వెల్లడించారు.

Updated Date - 2023-06-10T13:51:55+05:30 IST