TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం
ABN , First Publish Date - 2023-07-24T14:00:13+05:30 IST
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ 90 మందిని పైగా సిట్ అధికారులు అరెస్టు చేశారు. పేపర్ లీకేజ్‌లో ప్రమేయం ఉన్న వారంతా కేసు నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ 90 మందిని పైగా సిట్ అధికారులు అరెస్టు చేశారు. పేపర్ లీకేజ్‌లో ప్రమేయం ఉన్న వారంతా కేసు నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలు సిమ్ కార్డులు మార్చి పుణ్యక్షేత్రాలకు తిరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో తప్పించుకోలేమని తెలుసుకొని సిట్ ఎదుట లొంగిపోయారు.
15 మంది కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం జరుగుతోంది. ఈ నెలాఖరులోగా మరో 10 మందిని సిట్ అరెస్టు చేయనుంది. ఫోరెన్సిక్ నివేదిక అందగానే రెండో చార్జిషీట్ దాఖలు చేయడానికి సిట్ సిద్ధమైంది. పేపర్ లీకేజ్ కేసులో అసలు సూత్రధారులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిగా సిట్ తేల్చింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్చార్జ్ శంకర్ లక్ష్మి సిస్టం నుంచి ప్రవీణ్ పేపర్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. శంకర్ లక్ష్మి డైరీలో ఉన్న పాస్వర్డ్ యూజర్ నేమ్ ద్వారా పేపర్ లీకేజ్ జరిగినట్లు గుర్తించారు.