Kasani Gnaneshwar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో టీటీడీపీ.. కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేసేది అక్కడి నుంచే..

ABN , First Publish Date - 2023-10-12T16:46:26+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Election) బరిలో టీటీడీపీ(TTDP) పార్టీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈమేరకు పార్టీ క్యాడర్‌ను టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్(Kasani Gnaneshwar Mudiraj) సమాయత్తం చేస్తున్నారు.

Kasani Gnaneshwar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో టీటీడీపీ.. కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేసేది అక్కడి నుంచే..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Election) బరిలో టీటీడీపీ(TTDP) పార్టీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈమేరకు పార్టీ క్యాడర్‌ను టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్(Kasani Gnaneshwar Mudiraj) సమాయత్తం చేస్తున్నారు. పార్టీకి బలమున్న నియోజకవర్గాల్లో పోటీచేయాలని తెలంగాణ తెలుగుదేశం నిర్ణయం తీసుకుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి‌ పోటీచేస్తానని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. 2009లో కూడా కుత్బుల్లాపూర్ నుంచే కాసాని పోటీచేశారు. ఖైరతాబాద్ నుంచి అర్వింద్ కుమార్ గౌడ్ పోటీచేసే అవకాశం ఉంది. మునుగోడు బరిలో ఐలయ్య యాదవ్ బరిలో ఉండనున్నారు. మరికొన్ని సీట్లపై త్వరలోనే కీలక నిర్ణయాన్ని టీటీడీపీ తీసుకోనున్నది.

Updated Date - 2023-10-12T16:46:26+05:30 IST