Jeevitha Rajasekhar: బీఆర్ఎస్పై జీవిత సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-02-22T20:15:10+05:30 IST
బీజేపీ (BJP) మీటింగ్‌లతో బీఆర్ఎస్ (BRS) నేతలకు వణుకు పుడుతుందని బీజేపీ నాయకురాలు, సెన్సార్ బోర్డు మెంబర్ జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) అన్నారు.
హైదరాబాద్: బీజేపీ (BJP) మీటింగ్‌లతో బీఆర్ఎస్ (BRS) నేతలకు వణుకు పుడుతుందని బీజేపీ నాయకురాలు, సెన్సార్ బోర్డు మెంబర్ జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజా గోస- బీజేపీ భరోసా కార్యక్రమంపై చర్చించుకుంటున్నామని చెప్పారు. బీఆర్ఎస్పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ నేతలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని జీవిత రాజశేఖర్ విమర్శించారు. బీజేపీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు అందరూ చాలా లైట్ గా తీసుకున్నారని, ఫిబ్రవరి 10న ఈ కార్యక్రమాలు చేపట్టామని, 25 తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని జీవిత రాజశేఖర్ అన్నారు. అన్ని గ్రామాల్లో తాము పర్యటించి ప్రజలందరితో మాట్లాడామని ఆమె చెప్పారు. బీఆఎస్ పార్టీపై ప్రతి ఒక్కరిలో తీవ్రమైన అసంతృప్తి ఉందని జీవిత వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో చాలా ఘోరంగా మోసపోయామని ప్రజలు చెబుతున్నారని జీవిత రాజశేఖర్ అన్నారు. ప్రజలు కక్షతో ఉన్నారని, ఓటు ద్వారా బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇటీవల జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా (Coming elections) ఆసక్తికరంగా సాగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కారణం ఏంటి అంటే, ఈసారి చిత్రపరిశ్రమ (Telugu Film Industry) నుండి కొంతమంది రెండు రాష్ట్రాల్లో పోటీ చేసే అవకాశం ఉందని, పార్టీలు కూడా పరిశ్రమ నుంచి ఎవరు వచ్చినా ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా కూడా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ నుంచి చిత్ర పరిశ్రమ తరపున పోటీ చేసే వారిలో జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) ముందున్నారు. జీవిత బీజేపీ పార్టీ నుంచి పోటీ ఖాయం అని కూడా తెల్సింది. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి ఎన్నికల సమయంలో ప్రచారం మాత్రమే చేసిన జీవిత ఈసారి బీజేపీ నుండి సీటు కచ్చితంగా వచ్చేట్టు చేసుకున్నారు.
ఈ మధ్య జరిగిన మునుగోడు (Munugode) ఉప ఎన్నికల్లో (By-election) బీజేపీ తరపున జీవిత చాలా గట్టిగా ప్రచారం చేసారు. ఆ తరువాత బీజేపీ తెలంగాణ (#BJPTelangana) అధ్యక్షుడు, అలాగే ఈటెల రాజేందర్ (Etela Rajender) నాయకత్వం లో జీవిత తరచూ బీజేపీ నాయకులను కలుస్తూ వున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకి రానున్న ఎన్నికల్లో సీటు ఖాయం చేసారని కూడా తెలిసింది. ఆమె మీద బీజేపీ నాయకత్వం చాల నమ్మకంగా ఉండబట్టే, ఆమెకి ప్రస్తుతం వికారాబాద్ నియోజక (Vikarabad Constituency) వర్గ బాధ్యతలను బీజేపీ నాయకత్వం అప్పగించింది తెలిసింది. రానున్న ఎన్నికలకు బీజేపీ సమాయత్తం అవుతోందని అందులో భాగంగానే జీవిత రాజశేఖర్ ని వికారాబాద్ నియోజకవర్గానికి ఇంచార్జి గా నియమించారని తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి
లాయర్లకు సీఎం జగన్ గుడ్‌న్యూస్..
లోకేష్ పాదయాత్రకు పోలీసుల అడ్డంకులు