TS NEWS: కరీంనగర్ జిల్లాలో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు.. కారణమేంటంటే..?
ABN , First Publish Date - 2023-09-18T23:12:57+05:30 IST
జిల్లాలోని హుజురాబాద్(Huzurabad)లో గల మహాత్మా జ్యోతిభా పూలే పాఠశాల(Mahatma Jyotibha Poole School)లో 5 గురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్(Huzurabad)లో గల మహాత్మా జ్యోతిభా పూలే పాఠశాల(Mahatma Jyotibha Poole School)లో 5 గురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరిగి ఇద్దరు విద్యార్థులు పడిపోయారు. ఇంకో ఇద్దరు విద్యార్థులు ఆయాసంతో బాధపడుతుండగా, మరొకరికి కడుపునొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 10వ తరగతి చదువుతున్న శరణ్య అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థుల పరిస్థితిపై తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కలుషిత ఆహారం తినడంతోనే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థులకు శుభ్రంగా లేని ఆహారం పెట్టిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.