Share News

Tummala: ఈ పాలకులను తరమి కొట్టాలి: తుమ్మల

ABN , First Publish Date - 2023-11-11T08:49:27+05:30 IST

ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారంలో స్పీడ్ పెంచారు. శనివారం ఖమ్మం కూరగాయల మార్కెట్ హోల్ సేల్ అండ్ రిటైల్ మార్కెట్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Tummala: ఈ పాలకులను తరమి కొట్టాలి: తుమ్మల

ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswararao) ప్రచారంలో స్పీడ్ పెంచారు. శనివారం ఖమ్మం కూరగాయల మార్కెట్ హోల్ సేల్ అండ్ రిటైల్ మార్కెట్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో కూరగాయల మార్కెట్, పత్తి మార్కెట్ నిర్మాణం తన హయాంలో చేశానని, రైతులకు, వ్యాపారులుకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు వసతులు కల్పించానన్నారు. అరాచక శక్తులు లైసెన్స్‌ల కోసం లక్షల్లో దోచుకున్నారనీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఖమ్మంలో శాశ్వత పనులు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో చేసే భాగ్యం తనకు దక్కిందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే మీరు కోరుకున్న పండ్ల మార్కెట్ నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. చిరు వ్యాపారుల పొట్ట కొట్టే శక్తులు లేకుండా ప్రశాంతంగా వ్యాపారాలు సాగాలంటే ఈ పాలకులను తరమి కొట్టాలని, మీ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల నాగేశ్వరరావు పిలుపిచ్చారు.

Updated Date - 2023-11-11T08:49:28+05:30 IST