Dalit bandhu: దళితబంధులో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలి: రఘునందన్‌

ABN , First Publish Date - 2023-04-28T16:16:50+05:30 IST

దళితబంధు (Dalit bandhu)లో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు (MLA Raghunandan Rao) డిమాండ్ చేశారు.

Dalit bandhu: దళితబంధులో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలి: రఘునందన్‌

హైదరాబాద్: దళితబంధు (Dalit bandhu)లో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు (MLA Raghunandan Rao) డిమాండ్ చేశారు. తప్పు చేసిన మంత్రులు, బీఆర్‌ఎస్ (BRS) ఎమ్మెల్యేలను మందలించాల్సిందిపోయి.. సీఎం కేసీఆర్ (CM KCR) వెనకేసు కొస్తున్నారని విమర్శించారు. సొంత ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే సీఎం ఏం చేస్తున్నారు?.. వారిపై సీబీఐ (CBI) దర్యాప్తు చేయించే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని ఏసీబీ డీజీ సుమోటోగా కేసు నమోదు చేసి.. సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? అని మరోసారి ప్రశ్నించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనూ డబుల్ బెడ్‌రూం ఇళ్లకు.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రఘునందన్‌రావు తెలిపారు.

దళితబంధుకు అవినీతి చీడ!

దళితులను ఆర్థికంగా బలోపేతంచే సేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి అవినీతి చీడ పడుతోంది. పథకం ప్రారంభంలోనే కొంత మంది నేతల కన్నుపడింది. ఇప్పటికే దళితబస్తీ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఇప్పిస్తామంటూ ఒక్కో కుటుంబం నుంచి లక్షల రూపాయాలు దండుకున్న నేతలు.. ఈ పథకాన్ని కూడా వదిలి పెట్టెలా లేరు. ఎలాంటి అర్హత, ఆంక్షలు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షల నిధులను అందించి ఆర్థికపరమైన సహకారం అందించాలని నిర్ణయించింది. కాని వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు మండల, గ్రామస్థాయి నేతలు అందినకాడికి దండుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు దళిత దళితబంధు పథకం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారుతోంది. మరో ఆరు నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో హుజురాబాద్‌ నియోజకవర్గం మాదిరిగానే అన్ని నియోజకవర్గాల్లో పరిపూర్ణ స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయాలని దళితుల నుంచి వస్తున్న డిమాండ్‌ వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

Updated Date - 2023-04-28T16:16:50+05:30 IST