Share News

TS News: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-12-11T16:17:35+05:30 IST

Telangana: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

TS News: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

నిజామాబాద్: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (Armor BJP MLA Paidi Rakesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Former MLA Jeevan Reddy) తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. విదేశాల నుంచి కూడా చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. అక్రమ క్వారీలు, అక్రమ మొరం తవ్వకాలపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో సహజ సిద్ధమైన వనరులను కాపాడుతానని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-12-11T16:17:36+05:30 IST