Share News

Kavita: కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దు..

ABN , First Publish Date - 2023-11-17T17:06:11+05:30 IST

నిజామాబాద్ జిల్లా: కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దని, చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్‌ను నమ్ముదామా? లేదా కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా? అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రజల నుద్దేశించి ప్రశ్నించారు.

Kavita: కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దు..

నిజామాబాద్ జిల్లా: కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పార్టీలను నమ్మి మోసపోవద్దని, చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్‌ (BRS)ను నమ్ముదామా? లేదా కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా? అంటూ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) ప్రజల నుద్దేశించి ప్రశ్నించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలంలోని మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ రెండు పార్టీలు ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించవని, పదిసార్లు అవకాశం ఇస్తే ఏమీ చేయని కాంగ్రెస్... ఒక్క అవకాశం ఇవ్వాలని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. నిత్యం తెలంగాణ ప్రజల బాగు కోసం ఆలోచించే సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-11-17T17:06:12+05:30 IST