Share News

Telangana Elections: భర్త సస్పెండ్‌తో భార్య రాజీనామా... కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌కు షాక్

ABN , First Publish Date - 2023-10-31T10:40:17+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో బీఆర్‌ఎస్ షాక్ తగిలింది.

Telangana Elections: భర్త సస్పెండ్‌తో భార్య రాజీనామా... కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌కు షాక్

కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పోటీ చేస్తున్న కామారెడ్డిలో బీఆర్‌ఎస్ (BRS) షాక్ తగిలింది. కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియ బీఆర్‌ఎస్ పార్టీకీ రాజీనామా చేశారు. నిన్న(సోమవారం) ఆమె భర్త చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇందు ప్రియ కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేసింది. రాజీనామాను పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్‌కు అందజేశారు. బీఆర్‌ఎస్‌కు టాటా చెప్పిన ఇందు ప్రియ, ఆమె భర్త చంద్రశేఖర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దంపతులు ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ వంశీ, పలువురు యువకులు హస్తం కండువా కప్పుకున్నారు.

Updated Date - 2023-10-31T10:40:17+05:30 IST