Rachakanda CP: నూతన సంవత్సర వేడుకల్లో మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు
ABN , Publish Date - Dec 24 , 2023 | 11:37 AM
నూతన సంవత్సర వేడుకల్లో మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని రాచకాండ సీపీ సుధీర్‌బాబు(Rachakanda CP Sudhir Babu) హెచ్చరించారు.
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకల్లో మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని రాచకాండ సీపీ సుధీర్‌బాబు(Rachakanda CP Sudhir Babu) హెచ్చరించారు. వేడుకల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి కమిషనరేట్‌లో శనివారం పబ్‌లు, బార్లు, రెస్టారెంట్స్, ఫామ్‌హౌస్, వైన్‌షాపులు, ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఔట్‌డోర్ కార్యక్రమాలకు డీజే అనుమతి లేదని, బాణసంచా కాల్చడానికి వీల్లేదని, పరిమితికి మించి ఈవెంట్‌లోకి ప్రేక్షకులను అనుమతించకూడదని పేర్కొన్నారు. వేడుకల్లో ఈవెంట్ నిర్వాహకులు డ్రగ్స్ వినియోగించకూడదని, మహిళలతో అసభ్యకర డాన్స్‌లు నిర్వహించకూడదని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఫ్లై ఓవర్లను మూసివేస్తామన్నారు. సమావేశంలో డీసీపీలు జానకి, రాజేష్ చంద్ర, శ్రీనివాస్, గిరిధర్, ఇందిర, సాయి శ్రీ, మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.