TS NEWS: వరంగల్‌లో నయా దండుపాల్యం.. దొంగల అరెస్ట్.. విచారణలో విస్తుపోయే నిజాలు..!

ABN , First Publish Date - 2023-09-13T18:40:57+05:30 IST

వరంగల్(Warangal) నగరంలో కొద్దిరోజుల క్రితం 8 అపార్ట్‌మెంట్‌లలో దొంగతనం జరిగింది. అయితే ఈ దొంగతనలపై బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు.

TS NEWS: వరంగల్‌లో నయా దండుపాల్యం..  దొంగల అరెస్ట్.. విచారణలో విస్తుపోయే నిజాలు..!

వరంగల్: వరంగల్(Warangal) నగరంలో కొద్దిరోజుల క్రితం 8 అపార్ట్‌మెంట్‌లలో దొంగతనం జరిగింది. అయితే ఈ దొంగతనలపై బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం నాడు వరంగల్‌లో‌ని తన కార్యాలయంలో సీపీ రంగనాథ్(CP Ranganath) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..‘‘క్రైమ్ మీటింగ్ జరుగుతుండగానే చోరీలు జరిగాయి. వరంగల్ నగరంలో మొత్తం 8 అపార్ట్‌మెంట్‌లలో దొంగతనం చేశారు. అంతరాష్ట్ర ముఠా కొన్ని రోజులుగా వరంగల్‌లో రెక్కీ నిర్వహించింది. ఈ ముఠా టోటల్‌గా 32 దొంగతనాలు చేసింది. నిందితులు 8 నిమిషాలకు ఒక్కో దొంగతనం చేస్తుంటారు. 3 ఢిల్లీ, 4 ఆదిలాబాద్, 5 వరంగల్, 6 బెంగళూర్‌లో ఈ ముఠా దొంగతనం చేసింది. డీసీపీ(DCP) క్రైమ్స్ మురళి ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాం. టోల్ గేట్ ఆధారంగా నిందితులను పట్టుకున్నాం.

వీరికి మరో 9 మంది నిందితులు సహకరించారు. ఈ ముఠాకు ఆయా ప్రధాన రాష్ట్రాల్లో భారీ నెట్వర్క్ ఉంది. ఢిల్లీలో పోలీసులు సహకారం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నాం. అంతరాష్ట్ర ముఠా మొత్తం వరంగల్‌లో 11 దొంగతనాలు చేసేందుకు పథకం రచించగా.. 8 చోరీలు చేశారు.పట్టుపడిన దొంగలపై పీడీ యాక్ట్ అమలు చేస్తాం‌‌’’ అని వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాకు వివరాలను వెల్లడించారు. కాలనీల్లో ఎవరైనా అనుమానితులు సంచరిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. సీసీ కెమెరాలను ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసుకోవాలని.. చోరీలు, నేరాలు జరగకుండా ఉండేందుకు ఇవి సహకరిస్తాయని సీపీ రంగనాథ్ తెలిపారు.

Updated Date - 2023-09-13T18:40:57+05:30 IST