Share News

AP News: ఖాజీపేట బాలికోన్నత పాఠశాలల్లో 50 మంది విద్యార్థినులకు అస్వస్థత

ABN , Publish Date - Jul 02 , 2024 | 10:33 AM

పలు పాఠశాలల్లో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు విద్యార్థుల పాలిట ఇబ్బందికరంగా మారుతోంది. వారిని ఆసుపత్రుల పాలు చేస్తోంది. ఖాజీపేట బాలికోన్నత పాఠశాలలో ఏమైందో ఏమో కానీ అకస్మాత్తుగా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు.

AP News: ఖాజీపేట బాలికోన్నత పాఠశాలల్లో 50 మంది విద్యార్థినులకు అస్వస్థత

కడప: పలు పాఠశాలల్లో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు విద్యార్థుల పాలిట ఇబ్బందికరంగా మారుతోంది. వారిని ఆసుపత్రుల పాలు చేస్తోంది. ఖాజీపేట బాలికోన్నత పాఠశాలలో ఏమైందో ఏమో కానీ అకస్మాత్తుగా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. బాలికలంతా తీవ్ర జ్వరం, గొంతునొప్పి, విరేచనాలతో విద్యార్థినులంతా బాధపడుతున్నారు. కొందరు విద్యార్థినులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలకు వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించి అస్వస్థతకు కారణమేంటో కనుక్కున్నారు. స్కూల్లో కలుషిత నీరే అనారోగ్యానికి కారణమని అధికారులు తేల్చారు.

Updated Date - Jul 02 , 2024 | 10:33 AM