Share News

Amaravati : అన్న క్యాంటీన్లకు విరాళాల వెల్లువ

ABN , Publish Date - Aug 16 , 2024 | 05:42 AM

రాష్ట్రంలో పునఃప్రారంభమైన అన్న క్యాంటీన్‌లకు విరాళాలందించే విషయంలో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించే నిమిత్తం పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలు, వృద్ధులు సైతం తరలి వచ్చి విరాళాలిస్తున్నారు.

Amaravati : అన్న క్యాంటీన్లకు విరాళాల వెల్లువ

  • ఒక్క రోజే రూ.2 కోట్లకుపైగా రాక

  • ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేసిన మున్సిపల్‌ శాఖ

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పునఃప్రారంభమైన అన్న క్యాంటీన్‌లకు విరాళాలందించే విషయంలో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించే నిమిత్తం పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలు, వృద్ధులు సైతం తరలి వచ్చి విరాళాలిస్తున్నారు. బుధవారం ఒక్క రోజే రూ.2 కోట్లకుపైగా విరాళాలు అందాయి.


వివిధ వర్గాల ప్రజలు, సంస్థలు విరాళాలిచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో అన్న క్యాంటీన్ల నిర్వహణ చూస్తున్న మున్సిపల్‌శాఖ విరాళాలు తీసుకునేందుకు బ్యాంక్‌ ఖాతా వివరాలను ప్రకటించింది. విరాళాలు పంపించాలనుకునేవారు ఆ ఖాతాకు నేరుగా ఆన్‌లైన్‌ విధానంలో లేదా చెక్‌ రాసి పంపవచ్చని తెలిపింది. అన్న క్యాంటీన్స్‌, అకౌంట్‌ నెంబరు 37818165097కు గుంటూరు చంద్రమౌళినగర్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌కు చెందేలా జమచేయవచ్చని పేర్కొంది.


ఎస్‌బీఐ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ 0020541 నంబరుకు నగదు పంపవచ్చని తెలిపింది. గురువారం గుడివాడలో జరిగిన అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఖాతా వివరాలు ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతో ఒక స్ఫూర్తినింపేలా అన్న క్యాంటీన్ల నిర్వహణ ఉంటుందని సీఎం చెప్పారు.

Updated Date - Aug 16 , 2024 | 07:51 AM