Share News

COLLECTOR : మత్తు పదార్థాలను అరికట్టండి

ABN , Publish Date - Jun 28 , 2024 | 11:42 PM

జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు లేకుండా గట్టి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో డ్రగ్స్‌ రవాణా, గంజాయి సాగు, రవాణా కాకుండా చూడాలని అన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు వినియోగించకుండా విద్యాలయాలలో అవగాహన కార్యక్రమాలు...

COLLECTOR : మత్తు పదార్థాలను అరికట్టండి
Collectors and officials are unveiling posters showing the dangers of drugs

నిఘా వేయండి.. తనిఖీలను పెంచండి: కలెక్టర్‌

అనంతపురం టౌన, జూన 28: జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు లేకుండా గట్టి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో డ్రగ్స్‌ రవాణా, గంజాయి సాగు, రవాణా కాకుండా చూడాలని అన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు వినియోగించకుండా విద్యాలయాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వాటివల్ల కలిగే అనర్థాలను తెలియజేయాలని సూచించారు. జిల్లా మీదుగా వెళుతున్న కర్నాటక బస్సులను, ఇతర వాహనాలను తనిఖీ చేయాలని, సరిహద్దు ప్రాంతాలలో గట్టి నిఘా వేయాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాలను నివారించండి

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. ప్రమాదాలు, రోడ్డు భద్రతపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 39 ప్రాంతాలలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, వాటిని బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించామని అన్నారు. అక్కడ ప్రమాదాలు జరగకుండా


అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్వహణ కొన్నిచోట్ల సరిగా లేదని, ఆయా ప్రాంతాలలో ప్లాంటేషన, లైటింగ్‌కు చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు భద్రతపై స్లోగన్స ప్రదర్శించాలని, కలెక్టరేట్‌ వద్ద డిజిటల్‌ స్ర్కీన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో 40 సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటిని ఇనస్టలేషన చేసి జిల్లా పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌కు కనెక్షన ఇవ్వాలని సూచించారు. తపోవనం, ఆంధ్రజ్యోతి కార్యాలయం, కళ్యాణదుర్గం రోడ్డు ప్రాంతాలలో లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జాతీయ రహదారులలో ఎక్కువగా జరుగుతున్నాయని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ గుర్తింపు పరికరాలను మరమ్మతు చేయించాలని, విస్తృతంగా పరీక్షలు చేయాలని ఆదేశించారు. నగరంలోని పోలీస్‌ పెట్రోల్‌ బంకు, ఓల్డ్‌ టౌన కూరగాయల మార్కెట్‌, పీటీపీ తదితర ప్రాంతాలలో వారంలోపు ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశాలలో డీటీసీ వీర్రాజు, డీఎస్పీ ఆంథోనప్ప, ట్రాఫిక్‌ సీఐ నారాయణరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం సమంత, డీఎంహెచఓ ఈబీ దేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని ఆనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 28 , 2024 | 11:42 PM