పండుగలా పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Jul 02 , 2024 | 12:35 AM
మండలంలో పింఛన పంపిణీ పండుగల సాగింది. ఎ.నారాయణపురం, అనంతపురంరూరల్, రుద్రంపేట పంచాయితీలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్థానిక నాయకులతో కలసి ఇంటింటా పింఛన పంపిణీ చేశారు.
నంతపురంరూరల్: మండలంలో పింఛన పంపిణీ పండుగల సాగింది. ఎ.నారాయణపురం, అనంతపురంరూరల్, రుద్రంపేట పంచాయితీలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్థానిక నాయకులతో కలసి ఇంటింటా పింఛన పంపిణీ చేశారు. రాజీవ్‌కాలనీ పంచాయితీ మరాఠీకాలనీలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పింఛన అందించారు. కురుగుంట, ఆకుతోటపల్లి, నందమూరినగర్, పిల్లిగుండ్ల కాలనీ, తాటిచెర్ల, పామురాయి, మన్నిలా, కొడిమి, నరసనాయునికుంట, ఉప్పరపల్లి, చియ్యేడు, చిన్నంపల్లి గ్రామాల్లో కార్యక్రమం సాగింది. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవనకళ్యాన, ఎమ్మెల్యే పరిటాల సునీత చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.