Share News

FOREST DEPARTMENT : అటవీశాఖలో అక్రమాలపై ఆరా

ABN , Publish Date - Jul 01 , 2024 | 11:59 PM

జిల్లా అటవీశాఖలో జరిగిన అక్రమాలపై ఏపీసీసీఎఫ్‌( అడిషినల్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) ఆర్‌కే సుమన సోమవారం ఆరా తీశారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కేంద్రానికి వచ్చారు. సీసీఎఫ్‌ నాగేశ్వరరావుతో కలిసి అనంతపురం ఉమ్మడి జిల్లాతో పాటు, చిత్తూరు జిల్లా డీఎ్‌ఫఓలతో సమావేశమయ్యారు. శాఖ పరమైన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గుమస్తాలకు సంబంధించి ..

FOREST DEPARTMENT : అటవీశాఖలో అక్రమాలపై ఆరా
Additional PCCF RK Sumana speaking in staff meeting

ఉన్నతాధికారులతో ఏపీసీసీఎఫ్‌ సమావేశం

రికార్డులు పరిశీలిన .. తప్పిదాలపై ఆగ్రహం

అనంతపురం న్యూటౌన, జూలై1: జిల్లా అటవీశాఖలో జరిగిన అక్రమాలపై ఏపీసీసీఎఫ్‌( అడిషినల్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) ఆర్‌కే సుమన సోమవారం ఆరా తీశారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కేంద్రానికి వచ్చారు. సీసీఎఫ్‌ నాగేశ్వరరావుతో కలిసి అనంతపురం ఉమ్మడి జిల్లాతో పాటు, చిత్తూరు జిల్లా డీఎ్‌ఫఓలతో సమావేశమయ్యారు. శాఖ పరమైన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గుమస్తాలకు సంబంధించి రికార్డులు సమగ్రంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు కూడ సరిగా లేకుండా ఏమి చేస్తున్నాని మండిపడ్డారు. దీంతో సీసీఎఫ్‌ కార్యాలయంలో సిబ్బంది ఏపీసీసీఎఫ్‌ ఎవరిని ఏమి అడుగుతారోనని బిక్కు బిక్కుమంటూ గడిపారు. శాఖాపరంగా అమలు జరుగుతున్న పథకాల రికార్డులు పూర్తి స్థాయిలో


పరిశీలించారు. సాయంత్రం వరకు సీసీఎఫ్‌ చాంబర్‌లోనే రికార్డుల పరిశీలన చేశారు. పలు సందర్భాల్లో ఏపీసీసీఎఫ్‌ ప్రశ్నలకు డీఎ్‌ఫఓలు నీళ్లు నమిలినట్లు తెలిసింది. దీంతో తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారి చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో డీఎ్‌ఫఓలు వినీతకుమార్‌, రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేటి పర్యటన ఇలా

జిల్లా పర్యటనకు వచ్చిన ఏపీసీసీఎఫ్‌ ఆర్‌కే సుమన జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు మంగళవారం ఉదయం పంపనూరు వద్ద ఉన్న నగరవనం పార్కును తనిఖీ చేయనున్నట్లు తెలిసింది. దీంతో పాటు అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అక్కడి నుంచి బయల్దేరి కళ్యాణదర్గుం, రాయదుర్గం ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న నగర వనాలను పరిశీలించనున్నారు. దీంతో పాటు పలు నర్సరీలను పరిశీలించనున్నట్లు తెలిసింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 01 , 2024 | 11:59 PM