Share News

JC PRABHAKAR REDDY : పెద్దారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలి

ABN , Publish Date - Jul 19 , 2024 | 11:49 PM

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెడితే పంచె విప్పి కొడతామని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరించారు. గెలిచినా, ఓడినా ఫ్యాక్షన మొదలు పెడతానని పెద్దారెడ్డి బహిరంగంగా చెప్పినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పెద్దారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఆయనతోపాటు ఆయన ఇద్దరు కొడుకులను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చశారు. మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే వైసీపీ హయాంలో ..

JC PRABHAKAR REDDY : పెద్దారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలి
JCPR speaking in the meeting

ఆయన తాడిపత్రికి వస్తే పంచె విప్పి కొడతా : జేసీ ప్రభాకర్‌ రెడ్డి వార్నింగ్‌

తాడిపత్రి, జూలై 19: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెడితే పంచె విప్పి కొడతామని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరించారు. గెలిచినా, ఓడినా ఫ్యాక్షన మొదలు పెడతానని పెద్దారెడ్డి బహిరంగంగా చెప్పినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పెద్దారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఆయనతోపాటు ఆయన ఇద్దరు కొడుకులను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చశారు. మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. తనను జామీను ఇవ్వాలని, లేదంటే


అరెస్టు చేస్తామని డీఎస్పీ జనార్దననాయుడు తమ లాయర్‌కు చెప్పారని, చేతనైతే అరెస్టు చేయాలని సవాలు విసిరారు. తనను డీఎస్పీ అరెస్లు చేస్తే ఎవరో ఒకరు జామీను ఇస్తారని, లేదంటే లోపలే ఉంటానని అన్నారు. పోలింగ్‌ తరువాత పెద్దారెడ్డి తమ పార్టీ నాయకుడు సూర్యముని ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేస్తే.. పోలీసులు దగ్గరుండి కాపలా కాయడం ఏమిటని ప్రశ్నించారు. పెద్దారెడ్డిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడేందుకే తమ ఇంటిచుట్టూ పోలీసులను పెట్టామని ఎస్పీ గౌతమిశాలి చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. పెద్దవడుగూరు మండలంలో టీడీపీ నాయకుడు రెడ్డప్పరెడ్డి మామిడిచెట్లను వైసీపీ మద్దతుదారులు నరికివేస్తే పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని అన్నారు. తాడిపత్రిలో తమకు శత్రువులు ఎవరూ లేరని, వైసీపీకి చెందిన ఎవరిపైనా కక్ష లేదని అన్నారు. కానీ వారిలో ఐదుగురిపై మాత్రం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తన కుమారుడు జేసీ అశ్మితరెడ్డిని మరో 20 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నానని అన్నారు. గతంలో ఒకరిద్దరి కోసం తమ ఊరిలో పండుగకు అనుమతులు ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కి తీసుకున్నారని, ఇప్పుడు ఏ పండుగ అయినా అనుమతులు తీసుకోబోమని, సమాచారం మాత్రమే ఇస్తామని అన్నారు. గడిచిన ఐదేళ్లు చట్టం అమలు కాలేదని, ఇప్పుడు అలా కుదరదని అన్నారు. తాను ఎవరికీ హాని చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. వైసీపీలో ఆర్థిక పరిస్థితి బాగాలేనివారు వస్తే మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. బస్సులను సీజ్‌ చేసిన విషయంలో తనకు న్యాయం చేయాలని పదిరోజులు గడువు ఇచ్చానని, కానీ ఇప్పటివరకు అధికారుల నుంచి సమాధానం రాలేదని అన్నారు. అప్పటి రవాణాశాఖ మంత్రి పేర్నినాని, కమిషనర్‌ సీతారామాంజనేయులు, డీటీసీ ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితోపాటు ఆయన కుమారులపై ఫిర్యాదు చేయడానికి ఈ నెల 24న అనంతపురానికి వెళతానని తెలిపారు. కేసు నమోదు చేసేవరకు అక్కడే బైఠాయిస్తానని అన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 19 , 2024 | 11:49 PM