MLA MS RAJU : జగనవి దిగజారుడు రాజకీయాలు
ABN , Publish Date - Sep 13 , 2024 | 12:16 AM
ప్రజలు కష్టాల్లో ఉండి బాధలు పడుతుంటే చూసి రాక్షసానందం పొందే వ్యక్తి జగన అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. అయితే కష్టా ల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండి వారిని అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్య మంత్రి చంద్రబాబును చూసి జీర్ణించుకోలేక శిశుపాలుడితో పోల్చడం జగన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. వారు గురువారం స్థానిక ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.
ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
మడకశిరటౌన, సెప్టెంబరు 12: ప్రజలు కష్టాల్లో ఉండి బాధలు పడుతుంటే చూసి రాక్షసానందం పొందే వ్యక్తి జగన అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. అయితే కష్టా ల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండి వారిని అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్య మంత్రి చంద్రబాబును చూసి జీర్ణించుకోలేక శిశుపాలుడితో పోల్చడం జగన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. వారు గురువారం స్థానిక ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. విజయవాడలో ఇంత పెద్దఎ త్తున వరదలు వచ్చినా, ఎక్కడా శవరాజకీయాలు చేసేందుకు అవకాశం ఇవ్వకుం డా చంద్రబాబు కాపాడుతున్నారని జగన తీవ్ర ఆవేదనతో విమర్శలు చేస్తున్నా రని అన్నారు.
కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించడం మాని, నేరారోపణపై జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగామసురేష్‌ను పరామర్శించి టీడీపీపై, చంద్రబాబు పై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. వంద తప్పులు దాటుతున్నారని అంటున్న జగన వాటి బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన జగన మతిస్థిమితంలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే రాక్షసా నందం పొందుతూ, లండన టూర్ కోసం తహతహలాడుతున్న నీవు ఓ నాయకుడివా జగన అని మండిపడ్డారు.
వరద బాధితులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కంటి మీద కును కు లేకుండా శ్రమిస్తున్నారని, కష్టాల్లో ఉన్న ప్రజలకు నైతిక భరోసా కల్పించాల్సి న స్థానంలో ఉన్న నీవు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నావని జగనపై మండి పడ్డారు. ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటున్న ప్రభుత్వంపై విమర్శలు మాను కోవాలని హితవు పలికారు. వరదల వల్ల సర్వం కోల్పోయిన విజయవాడలోని బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, నియోజకవ ర్గం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందిం చేందుకు స్వచ్ఛం దంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, రాష్ట్ర వక్కలిగ సాధికార కన్వీనర్ బీఎం పాండురంగప్ప, ఉమేష్, మండల కన్వీనర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....