Share News

CD Hospital : అంతేనా..!

ABN , Publish Date - Jun 21 , 2024 | 11:48 PM

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన సీడీ ఆస్పత్రిలో ప్రజలకు సరైన వైద్య సేవలు అందకుండా పోతున్నాయి. అప్పటి పాలకులకు భవనాల నిర్మాణం, ప్రారంభంపై ఉన్న శ్రద్ధ సిబ్బంది నియామకంపై లేకపోవడంతో నగర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందకుండా పోయాయి. మూడు వందల మందికి పైగా ఉండే ఓపీని కేవలం ఇద్దరు వైద్యులే చూడాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. వచ్చిన యంత్రాలు కూడా టెక్నీషియన లేకపోవడంతో మూలకు చేరాయి. ఇలా కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ ఆస్పత్రి పరిస్థితి సిబ్బంది కొరతతో అగమ్యగోచరంగా మారింది. ...

CD Hospital : అంతేనా..!
A maternity ward with no doctors or doors open

డాక్టర్లు లేక తలుపులు తెరుచుకోని మాతాశిశు విభాగ వార్డు

అంతేనా..!

రూ.కోట్లతో సీడీ ఆస్పత్రి నిర్మాణం

వేధిస్తున్న డాక్టర్లు, సిబ్బంది కొరత

తలుపులు తెరుచుకోని గైనిక్‌ విభాగం

మొత్తం ఆస్పత్రికి ఇద్దరే డాక్టర్లు

టెక్నీషియన్లు లేక మూలకు చేరిన యంత్రాలు

మెరుగైన వైద్య సేవల కోసం నగర ప్రజల ఎదురుచూపు

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన సీడీ ఆస్పత్రిలో ప్రజలకు సరైన వైద్య సేవలు అందకుండా పోతున్నాయి. అప్పటి పాలకులకు భవనాల నిర్మాణం, ప్రారంభంపై ఉన్న శ్రద్ధ సిబ్బంది నియామకంపై లేకపోవడంతో నగర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందకుండా పోయాయి. మూడు వందల మందికి పైగా ఉండే ఓపీని కేవలం ఇద్దరు వైద్యులే చూడాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. వచ్చిన యంత్రాలు కూడా టెక్నీషియన లేకపోవడంతో మూలకు చేరాయి. ఇలా కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ ఆస్పత్రి పరిస్థితి సిబ్బంది కొరతతో అగమ్యగోచరంగా మారింది.

అనంతపురం టౌన, జూన 21: జిల్లాకేంద్రంలోని పాతూరు కాయగూరల మార్కెట్‌ సమీపంలో స్థానిక ప్రజలకు వైద్యసేవలు అందించడం కోసం దశాబ్దాల కిందటే సీడీ (చెస్ట్‌ డిసీజ్‌) ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రి రాష్ట్ర వైద్య విధాన పరిషత పరిధిలో నడుస్తోంది. అయితే ఆస్పత్రి భవనాలు దెబ్బతినడంతో కొత్త భవనాల నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం 2020లో ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.11.02 కోట్ల ఎనహెచఎం నిధులను మంజూరు చేసింది. కాంట్రాక్టర్‌ పనులు పూర్తి చేయడంతో గత ఏడాది సెప్టెంబరు 29న అప్పటి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఇతరప్రజాప్రతినిధులు, కలెక్టరు, వైద్యాధికారులు ఈఆస్పత్రిని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. కానీ ప్రజలకు మాత్రం అనుకున్న మేరకు ఈ ఆస్పత్రి వైద్య సేవలందించడం లేదు.

అందని సేవలు

అన్నిరకాల వైద్యసేవలు అందించాలని సీడీ ఆస్పత్రిని నిర్మించారు. అయితే ఇప్పటికీ పాత ఆస్పత్రిలో మాదిరిగానే ఒకచెస్ట్‌ డాక్టర్‌, ఒక ఫిజీషియన డాక్టర్‌ మాత్రమే ఉన్నారు. ప్రతి రోజు కనీసం 350నుంచి 400మందివరకు ఈఆస్పత్రికి రోగులు వస్తున్నట్లు ఓపీ రికార్డులు చెబుతున్నాయి. ఇక్కడకు వచ్చే రోగులకు ఈఇద్దరు డాక్టర్లే ఓపీ పరీక్షలు, అడ్మిషన అయినవారికి చికిత్సలు అందించాల్సి వస్తోంది. ఈఆస్పత్రిని ఏర్పాటు చేసేటపుడు ఇక్కడ గైనిక్‌, మాతాశిశు విభాగం సేవలు, సర్జన, ఆర్థే, అనస్తీషియా సేవలు అందించడం కోసం నిర్మాణానికి నిధులు కేటాయించారు. కానీ ఇప్పటికీ ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఫెథాలజీ, మైక్రోబయాలజీ డాక్టర్లు ఉన్నా ఫలితం లేకుండా పోయింది. గైనిక్‌ డాక్టర్లు లేకపోవడంలో ఆవిభాగం తలుపులు ఇప్పటికీ తెరుచుకోలేదు. ఇక ఆపరేషన థియేటర్లు దిష్టిబొమ్మలా దర్శనమిస్తూ కనిపిస్తున్నాయి.

స్కానింగ్‌యంత్రం వెనక్కి

ఇంత పెద్ద ఆస్పత్రికి వచ్చే రోగులకు స్కానింగ్‌ చేయడానికి రూ.లక్షలు వెచ్చించి యంత్రం కొనుగోలు చేసి పంపించారు. ఇక్కడ స్కానింగ్‌ తీయడానికి రేడియాలజీ టెక్నీషియన లేకపోవడంతో ఇప్పటి వరకు ఆ యంత్రంను మూలన పడేసినట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయంత్రం వాడకపోతే పాడైపోతుందని భావించిన ఇక్కడి డాక్టర్లు ఆశాఖ ఉన్నతాధికారులకు రేడియాలజీ టెక్నీషియనను నియమించాలని లేఖ రాశారు. అయినా ఫలితం లేదు. అందుకే ఇక్కడ ఉన్న యంత్రాన్ని మరో ఆస్పత్రికి తీసికెళ్లి వాడుకుంటా మని వైద్యులు లేఖలో పేర్కొన్నారంటే ఈ ఆస్పత్రి నిర్వహణ పట్ల ఉన్నతాధికారులకు ఎంతమేర శ్రద్ధ ఉందో అర్థం అవుతోంది. జిల్లా సర్వజన ఆస్పత్రిలో సరైన వసతులులేక రోగులు అనేక అవస్థలు పడుతున్నారు. కనీసం బాలింతల వార్డును కొంత మేరకు ఇక్కడకు తరలించి డాక్టర్లు, నర్సులు, కొంతమంది సిబ్బందిని ఇక్కడికి నియమిస్తే మంచి వైద్య సేవలందించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం కలెక్టరైనా ఈఆస్పత్రిపై దృష్టి పెడితే ప్రజలకు మంచి వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని నగర ప్రజలు పేర్కొంటున్నారు.

ఆరునెలలుగా స్వీపర్లకు జీతాలు ఇవ్వలేదు

ఈఆస్పత్రిని ప్రతిరోజు శుభ్రం చేయడానికి ఆరుగురు స్వీపర్లను, ముగ్గురు ఎంఎనఓలను ఏర్పాటు చేసుకున్నారు. వీరందరు ప్రతిరోజు ఆస్పత్రికి వచ్చి అన్ని గదులను శుభ్రం చేస్తున్నారు. ఎంఎనఓలు రోగులకు అవసరమైన సేవలు అందిస్తూ వస్తున్నారు. కానీ వీరికి ఈఏడాది జనవరి నెల నుంచి ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదని వారు వాపోతున్నారు.

వెనక్కు పంపిస్తున్నాం..

ఈఆస్పత్రికి స్కానింగ్‌యంత్రం వచ్చింది. అయితే స్కానింగ్‌లు తీయడానికి రేడియాలజీ టెక్నీషియన లేరు. దీంతో కొన్ని నెలలుగా ఆ యంత్రం వృథాగా పడి ఉంది. మరో వైపు గైనిక్‌, ఆర్థో, సర్జన, అనస్థీషియా డాక్టర్లు కూడా లేరు. వారుంటేనే స్కానింగ్‌ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకే అధికారులకు ఈ యంత్రంను పంపిస్తున్నాం.

- డాక్టర్‌ నవీన, (సీడీ ఆస్పత్రి ఇనచార్జ్‌ మెడికల్‌ ఆఫీసర్‌)కలెక్టరు దృష్టికి తీసుకెళ్లాం

సీడీ ఆస్పత్రి వ్యవహారం గురించి ఇప్పటికే కలెక్టరు దృష్టికి తీసికెళ్లాం. ఒకరోజు వచ్చి ఆస్పత్రిని స్వయంగా చూస్తానన్నారు. ఆతర్వాత కలెక్టరు ఏ సలహాలిస్తే ఆప్రకారం ముందుకు వెళ్తాం. ఇకస్కానింగ్‌యంత్రం వాడకపోతే పాడైపోతుందనే ఇంకో ఆస్పత్రికి తీసికెళ్లి వినియోగిస్తాం. ఇతర డాక్టర్ల నియామక వ్యవహారం నాకు తెలియదు. - డాక్టర్‌ రవికుమార్‌ (డీసీహెచఎస్‌)

- డాక్టర్‌ నవీన, (సీడీ ఆస్పత్రి ఇనచార్జ్‌ మెడికల్‌ ఆఫీసర్‌)

కలెక్టరు దృష్టికి తీసుకెళ్లాం

సీడీ ఆస్పత్రి వ్యవహారం గురించి ఇప్పటికే కలెక్టరు దృష్టికి తీసికెళ్లాం. ఒకరోజు వచ్చి ఆస్పత్రిని స్వయంగా చూస్తానన్నారు. ఆతర్వాత కలెక్టరు ఏ సలహాలిస్తే ఆప్రకారం ముందుకు వెళ్తాం. ఇకస్కానింగ్‌యంత్రం వాడకపోతే పాడైపోతుందనే ఇంకో ఆస్పత్రికి తీసికెళ్లి వినియోగిస్తాం. ఇతర డాక్టర్ల నియామక వ్యవహారం నాకు తెలియదు. - డాక్టర్‌ రవికుమార్‌ (డీసీహెచఎస్‌)

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 21 , 2024 | 11:48 PM