Share News

VIP KALAVA: పేదరిక నిర్మూలనే లక్ష్యం

ABN , Publish Date - Nov 27 , 2024 | 12:09 AM

పేదరిక నిర్మూలన కోసం ఫోర్‌పీల సూత్రాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయ సమావేశ మందిరంలో తహసీల్దార్‌ నాగరాజు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.

VIP KALAVA: పేదరిక నిర్మూలనే లక్ష్యం
Speaking Whip Kalava Srinivasulu

రాయదుర్గం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలన కోసం ఫోర్‌పీల సూత్రాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయ సమావేశ మందిరంలో తహసీల్దార్‌ నాగరాజు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. విప్‌ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంతే కాకుండా ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇంటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పట్టణ పరిధిలో ఉన్న ప్రభుత్వ లేఅవుట్‌లలో అనర్హులను గుర్తించి, వారి స్థానంలో పేదలకు స్థలాలు ఇస్తామన్నారు. వెయ్యి మందికి తగ్గకుండా పట్టాలు ఇవ్వడానికి స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. మున్సిపల్‌ స్థలాలు, రెవెన్యూ భూములు కబ్జా కాకుండా కాపాడుకుందామన్నారు. ఎలాంటి బేషజాలు లేకుండా దీనిని సీరియ్‌సగా పరిగణించి పనిచేయాలన్నారు. అధికారులు బృందాలుగా విడిపోయి మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు సమన్వయంగా లేఅవుట్‌లను సందర్శించాలన్నారు. కనీసం నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఫోర్‌ పీ సూత్రంలో భాగస్వామ్యం కావాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ దివాకర్‌రెడ్డి, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2024 | 12:09 AM