Share News

YSRCP: మంత్రి ఉషశ్రీ చరణ్.. భర్త చరణ్ రెడ్డి బాగోతం బట్టబయలు

ABN , Publish Date - May 12 , 2024 | 08:03 AM

అనంతపురం జిల్లా: పెనుకొండ వైసీపీ అభ్యర్థి మంత్రి ఉషశ్రీ చరణ్.. భర్త చరణ్ రెడ్డి భాగోతం బట్టబయలైంది. బెంగళూరులో మేనమామ జగన్నాథ్‌కు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని చరణ్ రెడ్డి కాజేసారు.

YSRCP:  మంత్రి ఉషశ్రీ చరణ్.. భర్త చరణ్ రెడ్డి బాగోతం బట్టబయలు

అనంతపురం జిల్లా: పెనుకొండ వైసీపీ (YCP) మంత్రి ఉషశ్రీ చరణ్ (Ushasri Charan).. భర్త చరణ్ రెడ్డి (Charan Reddy) భాగోతం బట్టబయలైంది. బెంగళూరులో మేనమామ జగన్నాథ్‌ (Jagannath)కు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని చరణ్ రెడ్డి కాజేసారు. బెంగళూరు (Bangalore) నగరంలోని యలహంక సమీపంలోని సింగనాయనహల్లిలో మేనమామ జగన్నాథ్‌కు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం, నివాస గృహం ఉన్నాయి. ఆ స్థలంపై కన్నేసిన చరణ్ రెడ్డి.. ముప్పై అడుగుల స్థలం కావాలని మేనమామ జగన్నాథ్‌ను కోరారు. మేనల్లుడు అడగడంతో ముప్పై అడుగుల స్థలాన్ని చరణ్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు.


అయితే రిజిస్ట్రేషన్ సమయంలో చరణ్ రెడ్డి పత్రాలను మార్చి ముప్పై అడుగులతో పాటు ఇంటిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కరెంట్ బిల్లు చరణ్ రెడ్డి పేరుతో రావడంతో నిర్గాంత పోయిన జగన్నాథ్.. చేసిన మోసంపై చరణ్ రెడ్డిని నిలదీశారు. దీంతో ఇల్లును తనకు అమ్మేశారంటూ మేనమామ జగన్నాథ్‌తో పాటు ఆయన భార్యను బయటికి గెంటేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన జగన్నాథ్.. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులతో ఇల్లు కట్టుకుంటే చరణ్ రెడ్డి అక్రమంగా కాజేసారంటూ జగన్నాథ్ భార్య నాగవేణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్

చంద్రబాబు కొనసాగివుంటే.. అమరావతిది మరో చరిత్రే!

Pawan Kalyan : వైసీపీకి ఓటేయొద్దు

పింఛను దానం కాదు.. హక్కు ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 12 , 2024 | 08:14 AM