Share News

ELECTRICITY : అక్రమ విద్యుత వాడకంపై విజిలెన్స కొరడా

ABN , Publish Date - Sep 19 , 2024 | 12:20 AM

జిల్లాలో అక్రమ విద్యుత వాడకంపై విద్యుత శాఖ విజిలెన్స అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమ విద్యుత వాడకం దారులపై జరిమాన విధించారు. నగరంలోని డి-5సెక్షన, శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓబుళదేవరచెరువు, అమరాపురం మండలాల్లో విద్యు త విజిలెన్స ఈఈ గోపి ఆధ్వర్యంలో అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు.

ELECTRICITY : అక్రమ విద్యుత వాడకంపై విజిలెన్స కొరడా
Electrical vigilance officials who participated in the raids

అనంతపురంరూరల్‌, సెప్టెంబరు 18: జిల్లాలో అక్రమ విద్యుత వాడకంపై విద్యుత శాఖ విజిలెన్స అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమ విద్యుత వాడకం దారులపై జరిమాన విధించారు. నగరంలోని డి-5సెక్షన, శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓబుళదేవరచెరువు, అమరాపురం మండలాల్లో విద్యు త విజిలెన్స ఈఈ గోపి ఆధ్వర్యంలో అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ..తనిఖీల్లో మాల్‌ప్రాక్టీస్‌ కేసులు ఎనిమిది, తక్కువ లోడు కనెక్షన తీసుకుని ఎక్కువ లోడ్‌ వాడు తున్న 32 మంది వినియోగదారులపై కేసులు నమోదు చేసినట్లు తెలి పారు. అలాగే సర్వీసులకు డైరెక్ట్‌ టాపింగ్‌ చేస్తున్న ఐదుగురు, మీటరు లే కుండా డైరెక్టుగా విద్యుత వాడుతున్న మరో ఐదుగురు, మీటర్‌ ఉండి డైరెక్టుగా కరెంటు వాడుతున్న ఇంకో ఐదుగురిపై కేసులు పెట్టినట్లు తెలిపా రు. తద్వారా రూ.2.46లక్షలు జరిమానా విధించినట్లు తెలిపారు. ఈడాడుల్లో డీఈఈలు రామాంజినేయులు, నాగేంద్ర, ఏఈఈలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 19 , 2024 | 12:20 AM