Share News

YCP : చేసింది కొంతే.. మింగింది ఎంతో?

ABN , Publish Date - Jul 21 , 2024 | 11:38 PM

తాడిపత్రి పట్టణ సమీపంలోని పాతబ్రిడ్జి వద్ద పెన్నానది ఒడ్డున గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వైఎ్‌సఆర్‌ గ్రామీణ పార్కు నిర్మాణంలో ఎన్నో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 12 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కుకు రూ.50లక్షలు మాత్రమే ఖర్చుచేసి దాదాపు కోటి రూపాయల మేర నిధులను స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పనులు కూడా అరకొరగానే పూర్తయ్యాయి. పలువురు వైసీపీ నాయకులు నిధులను స్వాహా చేయడమే పనులు పూర్తికాకపోవడానికి ప్రధాన కారణమన్న విమర్శలు ఉన్నాయి. సజ్జలదిన్నె గ్రామంతోపాటు బండల పరిశ్రమల్లో పనిచేస్తున్న కూలీలు, వారి పిల్లలకు ...

YCP : చేసింది కొంతే.. మింగింది ఎంతో?
Entrance of YSR Gramin Park

వైఎస్‌ఆర్‌ గ్రామీణ పార్కు నిర్మాణంలో అవకతవకలు

కోటిరూపాయలకు పైగా స్వాహా?

ఐదేళ్లలో పూర్తికాని పనులు

రూ.50 లక్షలు మాత్రమే ఖర్చుచేసిన వైనం

మందుబాబులకు అడ్డాగా మారిన పార్కు

తాడిపత్రి పట్టణ సమీపంలోని పాతబ్రిడ్జి వద్ద పెన్నానది ఒడ్డున గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వైఎ్‌సఆర్‌ గ్రామీణ పార్కు నిర్మాణంలో ఎన్నో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 12 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కుకు రూ.50లక్షలు మాత్రమే ఖర్చుచేసి దాదాపు కోటి రూపాయల మేర నిధులను స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పనులు కూడా అరకొరగానే పూర్తయ్యాయి. పలువురు వైసీపీ నాయకులు నిధులను స్వాహా చేయడమే పనులు పూర్తికాకపోవడానికి ప్రధాన కారణమన్న విమర్శలు ఉన్నాయి. సజ్జలదిన్నె గ్రామంతోపాటు బండల పరిశ్రమల్లో పనిచేస్తున్న కూలీలు, వారి పిల్లలకు


సాయంత్రం వేళల్లో ఆహ్లాదం కోసం ఏర్పాటుచేసిన పార్కులో వైసీపీ నాయకుల కాసుల కక్కుర్తి వల్ల పనులు పూర్తికాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పలు ఆటవస్తువులు కూడా చాలా నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. వీటితో ఆడుకునేటప్పుడు ఎవరికైనా ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- తాడిపత్రి

పంచాయతీ ఫండ్‌ రూ.26లక్షలు, మండల పరిషత ఫండ్‌ రూ.50లక్షలు

గన్నెవారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ గ్రామీణ పార్కు నిర్మాణానికి పంచాయతీ నిధులు రూ.26లక్షలు, మండల పరిషత నిధులు రూ.50లక్షలు మంజూరయ్యాయి. మొదట్లో పనులు చురుకుగా సాగాయి. వచ్చిన నిధులతో పార్కులో రోడ్లు, కంచె నిర్మాణం, చిన్నారులు ఆడుకోవడానికి ఆటవస్తువులు తదితర వాటిని ఏర్పాటుచేశారు. కాలం గడిచే కొద్ది పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. వేసిన తారురోడ్డుపై ఇప్పటికే కంకర తేలుతోంది. దీన్ని బట్టే ఎంతమేర నాణ్యతప్రమాణాలు పాటించారో అర్థమవుతోంది. మరికొన్నిచోట్ల ఎర్రమట్టితో రోడ్డు వేసి మమ అనిపించారు. చివరికి ఎన్నికలు రావడం పనులు కుంటుపడటంతో పార్కులో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కరువయ్యాయి.

కోటి రూపాయల నిధులు ఎక్కడ?

పార్కు నిర్మాణానికి తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న సిమెంట్‌ పరిశ్రమలతో పాటు గ్రానైట్‌, నల్లబండల పరిశ్రమలు, పలువురు దాతల నుంచి సుమారు రూ.కోటి మేర నిధులు సమకూరినట్లు సమాచారం. ఈ నిధులతో పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారని అందరూ అనుకున్నారు. కానీ పంచాయతీ, మండలపరిషత మంజూరు చేసిన నిధులలోనే సగం మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన మొత్తం ఏమైందో ఇప్పటికి లెక్క తేలలేదు. దాతలు ఇచ్చిన కోటి రూపాయలు ఎవరివద్ద ఉన్నాయో అధికారులే తేల్చాల్సి ఉంది.

పార్కులో పేట్రేగిపోతున్న మందుబాబులు

ఎన్నికల్లో వైసీపీ ఘోరపరాభవం చెందడంతో పార్కు నిర్వహణ గురించి గాలికి వదిలేశారు. దీంతో మందుబాబులు పేట్రేగిపోతున్నారు. సాయంత్రం అయితే చాలు మద్యం బాటిళ్లను తీసుకొని సిట్టింగ్‌ వేస్తున్నారు. దీంతో మహిళలు, చిన్నారులు పార్కుకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. మందుబాబుల కారణంగా చాలామంది పార్కుకు రావడం మానేశారు. మందుబాబులు ఎక్కడబడితే అక్కడ మద్యం తాగి సీసాలను పగలగొట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అయినప్పటికి ఏ అధికారి పట్టించుకోవడం లేదు.

రూ.కోటి గురించి తెలియదు

నేను ఈ మధ్యనే బాధ్యతలు స్వీకరించాను. వైఎస్‌ఆర్‌ గ్రామీణ పార్కుకు సంబంధించి పంచాయతీ, మండలపరిషత నిధులు మంజూరైన మాట వాస్తవమే. కానీ దాతల నుంచి కోటి రూపాయలు రావడం గురించి నాకు తెలియదు. విచారించి చర్యలు తీసుకుంటాం. - నరసింహారావు, ఎంపీడీఓ


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 21 , 2024 | 11:38 PM