Share News

CERTIFICATE : ఏమయ్యారు సార్‌..?

ABN , Publish Date - May 29 , 2024 | 11:52 PM

రెవెన్యూ అధికారులు మండల ప్రజలకు అందుబాటులో లేకుండా తిరుగుతున్నారు. అడ్మిషన్ల సమయం కావడంతో విద్యార్థులు, పంట రుణాల రెన్యువల్‌ సమయం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల విధులు, సమావేశాల పేరిట విడపనకల్లు తహసీల్దారు కార్యాలయానికి అధికారులు రావడమే మానేశారు. వనబీ అడంగల్‌ కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు.. పది రోజుల క్రితం ఆందోళన చేశారు. దీంతో మరుసటి రోజు అధికారులు అందుబాటులోకి వచ్చారు. ఆ తరువాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది...

 CERTIFICATE : ఏమయ్యారు సార్‌..?
Janani applied for EWS certificate

రెవెన్యూ కార్యాలయంలో కనిపించని అధికారులు

సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల పడిగాపులు

ధ్రువపత్రాల కోసం రైతుల పాట్లు

విడపనకల్లు, మే 29: రెవెన్యూ అధికారులు మండల ప్రజలకు అందుబాటులో లేకుండా తిరుగుతున్నారు. అడ్మిషన్ల సమయం కావడంతో విద్యార్థులు, పంట రుణాల రెన్యువల్‌ సమయం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల విధులు, సమావేశాల పేరిట విడపనకల్లు తహసీల్దారు కార్యాలయానికి అధికారులు రావడమే మానేశారు. వనబీ అడంగల్‌ కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు.. పది రోజుల క్రితం ఆందోళన చేశారు. దీంతో మరుసటి రోజు అధికారులు అందుబాటులోకి వచ్చారు. ఆ తరువాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.


- ఆర్‌.కొట్టాల గ్రామానికి చెందిన ఓసీ విద్యార్థిని జనని ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ కోసం మీసేవలో ఈనెల 23న దరఖాస్తు చేసింది. అదేరోజు వీఆర్వో, ఆర్‌ఐ సంతకాలు చేశారు. మిగిలింది తహసీల్దారు డిజిటల్‌ సంతకం మాత్రమే. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. పాలిటెక్నికల్‌ అడ్మిషన కౌన్సెలింగ్‌ సమయంలో ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉందని, వారం రోజులుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరని బాధితురాలు వాపోయింది. విద్యార్థిని బంధువులు రెవెన్యూ కార్యాలయ అధికారులతో రెండు రోజుల క్రితం వాగ్వాదానికి దిగారు.

- ఇదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలాలపై రుణం తీసుకునేందుకు 14 ఎకరాలకు వాల్యుయేషన సర్టిఫికెట్‌ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. మార్కెట్‌ వ్యాల్యూ కంటే తక్కువ చూపించి ఇచ్చినా ఫర్వాలేదని విన్నవించాడు. కానీ తహసీల్దారు తిరస్కరించారని బాధిత రైతు వాపోయారు. మండల ప్రజలకు సేవలు అందించకుండా, డిజిటల్‌ కీ తన జేబులో ఉంచుకుని తిరుగుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను కేవలం ఎన్నికల విధులను మాత్రమే వచ్చానని ఇతర పనులు చేయనని అంటున్నారని ఆవేదన చెందుతున్నారు. వారం క్రితం


విడపనకల్లు మండలానికి కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ వచ్చారు. ఆ సమయంలో సీపీఐ నాయకుడు ఎంబీ చెన్నరాయుడు తహసీల్దారుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా రెవెన్యూ అధికారులలో మార్పు రాలేదు. అనంతపురంలో మీటింగ్‌ అంటూ మూడు రోజలుగా అధికారులు కార్యాలయానికి రావటంలేదని మండల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు అందుబాటులోకి రావాలని కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 29 , 2024 | 11:52 PM