Share News

YCP :వైసీపీకి ఓటమి భయం

ABN , Publish Date - May 09 , 2024 | 12:44 AM

వైసీపీకి ఓటమి భయం పట్టుకుందా..? కూటమికే అధికారమిస్తున్నారని ప్రజల నాడి పసిగట్టేశారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓ వైపు ఆ పార్టీ మేనిఫెస్టో నింపిన అసంతృప్తి, మరోవైపు ఆ పార్టీ అధినేత జగన స్వరంలో మార్పు, ఇంకోవైపు బీజేపీ అగ్రనేతలు.. అందులోనూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమితషా విరుచుకుపడుతుండటంతో వైసీపీ అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. డబుల్‌ ఇంజిన సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ పెద్దలు ప్రజల్లో చైతన్యం నింపారు. బీజేపీ అగ్రనేతలు జగన పాలనపై విమర్శనాసా్త్రలు సంధించిన తరువాత సీఎం జగన మాటల్లో బేలతనం స్పష్టంగా కనిపిస్తోంది. ...

YCP :వైసీపీకి ఓటమి భయం
A YCP activist with a mustache growing

సహనం కోల్పోతున్న అభ్యర్థులు

దాడులు.. బెదిరింపులతో కవ్వింపు చర్యలు

హింసను ప్రేరేపించి.. లబ్ధి పొందాలని వ్యూహం

వేటు పడుతున్నా.. మారని పోలీసు యంత్రాంగం

పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఈసీ

(ఆంధ్రజ్యోతి, అనంతపురం): వైసీపీకి ఓటమి భయం పట్టుకుందా..? కూటమికే అధికారమిస్తున్నారని ప్రజల నాడి పసిగట్టేశారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓ వైపు ఆ పార్టీ మేనిఫెస్టో నింపిన అసంతృప్తి, మరోవైపు ఆ పార్టీ అధినేత జగన స్వరంలో మార్పు, ఇంకోవైపు బీజేపీ అగ్రనేతలు.. అందులోనూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమితషా విరుచుకుపడుతుండటంతో వైసీపీ అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. డబుల్‌ ఇంజిన సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ పెద్దలు ప్రజల్లో చైతన్యం నింపారు. బీజేపీ అగ్రనేతలు జగన పాలనపై విమర్శనాసా్త్రలు సంధించిన తరువాత సీఎం జగన మాటల్లో బేలతనం స్పష్టంగా కనిపిస్తోంది.


కుట్రలు.. కుతంత్రాలు..

సార్వత్రిక ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో లేదోనని, నమ్మకం రోజురోజుకి సన్నగిల్లుతోందని జగన వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడగానే వైసీపీలో నైరాశ్యం ఆలుముకుంది. పార్టీ అధినాయకత్వం నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయోగాని.. ఎన్నికల్లో అలజడులు, అరాచకాలకు ఆ పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడుతున్నారు. జిల్లాలోనూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బెదిరింపులు, రాళ్ల దాడులు ప్రారంభించారు. కూటమి అభ్యర్థులు, శ్రేణులను కేసుల్లో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు. కూటమి అభ్యర్థులు ప్రచారాలు చేసేచోట అంతు చూస్తాం.. ఊరు విడిపిస్తాం, ఎన్నికలు అయిపోగానే ఒక్కొక్కడి కథ చెప్తాం అని దూషణలు, బెదిరింపులకు దిగుతున్నారు. మీసం మెలేస్తూ.. తొడలు కొడుతూ రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఓటమి భయంతోనే కూటమి అభ్యర్థులను ఇబ్బంది పెట్టాలని వ్యూహం పన్నినట్లు కనిపిస్తోంది.

హింసను ప్రేరేపించేలా..

ఓటమి భయంతో వైసీపీ అభ్యర్థులు సహనాన్ని కోల్పోతున్నారు. కూటమి అభ్యర్థులు, శ్రేణులు, ఓటర్లపై అక్కసు వెల్లగక్కుతున్నారు. హింసను ప్రేరేపించేలా వైసీపీ అభ్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చొరవ చూపాల్సిన అధికార పార్టీ అభ్యర్థులు.. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బెదిరింపులకు దిగడం సరికాదని జనం అంటున్నారు. వైసీపీ అభ్యర్థుల తీరు


చూస్తే.. పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుందా అన్న అనుమానం కలుగుతోందని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎలక్షన్లో అతిపడిన నా కొడుకులెవరైనా సరే.. ఎలక్షన్ల తరువాత ఒక్కొక్కని కథ చెప్తా’ అని ఉరవకొండ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి రాంపురంలో బెదిరించారు. ‘మళ్లీ అధికారంలోకి వస్తే ఒక్కొక్క నా కొడుకుని ఊరు విడిపిస్తాం. నా వెంట్రుక కూడా పీకలేరు’ అని రాప్తాడు ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ రెడ్డి బి.యాలేరులో బెదిరింపులకు దిగారు. ‘పిచ్చిరెడ్డి కొట్టాలలో ఎంపీటీసీనే ఎత్తుకొచ్చాం. మీరెంత..?’ అంటూ ఊగిపోయారు. ఓటర్ల ఎదుట.. బహిరంగంగా అధికార పార్టీ అభ్యర్థులు ఈ స్థాయికి దిగజారి వ్యాఖ్యలు చేయడం ఏమిటని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ కంట కనిపెడుతున్న ఈసీ

వైసీపీతో అంటకాగుతున్న కొందరు పోలీసు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీఐజీ అమ్మిరెడ్డి, అనంతపురం అర్బన డీఎస్పీ వీరరాఘవరెడ్డి సహా పలువురిపై చర్యలు తీసుకుంది. దీంతో పోలీసుల వ్యవహారశైలిలో మార్పు వస్తుందని అందరూ భావించారు. కానీ కొందరు పోలీసు అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. హింసను ప్రేరేపించేలా వ్యవహరిస్తున్న వైసీపీ అభ్యర్థులు, శ్రేణులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో పోలీసుల వ్యవహారశైలిని ఎన్నికల కమిషన నిశితంగా గమనిస్తోందని సమాచారం. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఈ క్రమంలో పద్ధతి తప్పే మరికొందరిపై వేటు తప్పదని అంటున్నారు.


బరితెగిస్తున్నారు..

కనగానపల్లి మండలం రాంపురంలో టీడీపీ కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి పరిటాల సునీత ప్రచారానికి వెళితే.. స్థానిక వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. మీసాలు మెలేసి తొడలు కొట్టి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తే వారికే ఎదురుతిరిగారు. అంతకు కొన్నిరోజుల ముందు తోపుదుర్తి రాజారెడ్డి అర్ధరాత్రి అరాచకానికి తెరలేపారు. రామగిరి మండలం పీఆర్‌ కొట్టాలకు చెందిన మాదాపురం ఎంపీటీసీ ఉదంతం, ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు.. చంపేస్తామని బెదిరింపులు.. అరాచకానికి పరాకాష్ట. రాప్తాడు నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 09 , 2024 | 12:44 AM