MP Avinash Reddy: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దస్తగిరి మరో పిటిషన్
ABN , Publish Date - Mar 12 , 2024 | 12:42 PM
నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరో పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని దస్తగిరి పిటిషన్లో పేర్కొన్నారు. తన తండ్రిని ఏపీ సీఎం జగన్ రెడ్డి, సతీమణి భారతి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, అతని కుమారుడు చైతన్య రెడ్డి అనుచరులు దాడి చేశారని తెలిపారు.
హైదరాబాద్: నాంపల్లి సీబీఐ కోర్టు (CBI Court)లో మాజీ మంత్రి వైఎస్ వివేకా (YS Viveka) హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) మరో పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని దస్తగిరి పిటిషన్లో పేర్కొన్నారు. తన తండ్రిని ఏపీ సీఎం జగన్ రెడ్డి (CM Jagan), సతీమణి భారతి (Bharathi Reddy), దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, అతని కుమారుడు చైతన్య రెడ్డి అనుచరులు దాడి చేశారని తెలిపారు. విట్నెస్ ప్రొటెక్షన్ స్కీం కింద కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని దస్తగిరి తరుపు కౌన్సిల్ జడ శ్రవణ్ (Jada Sravan) కోరారు. దస్తగిరి పిటిషన్‌ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. మధ్యాహ్నం 2.30 తర్వాత విచారణ చేపడతామని సీబీఐ కోర్టు తెలిపింది. ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) వలన తనకు ప్రాణహాని ఉందని హైకోర్టులో దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు.
CM Jagan: అన్నీ జగన్ ఖాతాలోకే... సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న సీఎం
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.