Share News

Viveka Case: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

ABN , Publish Date - Feb 05 , 2024 | 03:44 PM

వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ డైలీ సీరియల్ మాదిరిగా సాగుతూనే ఉంది. నేడు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.

Viveka Case: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

ఢిల్లీ: వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ డైలీ సీరియల్ మాదిరిగా సాగుతూనే ఉంది. నేడు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ మూడో వారంలో కేసు తుది వాదనలు వింటామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం వెల్లడించింది.

ఏప్రిల్ 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో నాన్ మిస్లేనియస్ డే రోజు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేసు డైరీ మొత్తాన్ని కోర్టు ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. కేసు డైరీ 60 భాగాలుగా ఉందని కోర్టుకు సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. డిజిటల్ రూపంలోకి మార్చి ఈ- కేసు డైరీ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 22కి ముందు కేసు విచారణకు తీసుకునే పరిస్థితి లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు.

కాగా వివేకా హత్య కేసులో గతేడాది మే 31వ తేదీన అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను వైఎస్ వివేకానంద కూతురు సునీతా రెడ్డి జూన్ 9వ తేదీన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జూన్ 19వ తేదీన అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.

Updated Date - Feb 05 , 2024 | 03:44 PM