Share News

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అల్లూరి పేరు.. చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 21 , 2024 | 09:23 PM

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విమానాశ్రయానికి ఓ స్వాతంత్ర్య సమరయోధుడి పేరు పెడుతూ శాసనసభలో ఓ ప్రతిపాదన చేసింది.

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అల్లూరి పేరు.. చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం

అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడుతూ అసెంబ్లీలో ప్రతిపాదన చేశారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. గిరిజనుల పక్షాన పోరాటం చేసిన అల్లూరి ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించారని అన్నారు. చింతగొంది, కృష్ణదేవి పేట, రాజవొమ్మంగి పోలీసు స్టేషన్ల మీద దాడి చేసి బ్రిటిషర్ల గుండెల్లో ఆయన రైళ్లు పరిగెత్తించారని చెప్పారు.


పార్లమెంటులోనూ అల్లూరి విగ్రహం

అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారని చంద్రబాబు గుర్తుచేశారు. దేశం కోసం పోరాడిన ఇలాంటి వీరులను స్మరించుకోవడం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి వెల్లడించారు. మన్యంలో పోరాటం చేసిన అల్లూరి పేరును భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు పెట్టాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానిస్తోందని ఆయన తెలిపారు. అల్లూరి స్మారక మ్యూజియాన్ని నిర్మించాలని తాము డిసైడ్ అయ్యామని పేర్కొన్నారు. ఆయన విగ్రహం పార్లమెంటులో కూడా ఉండాలని కోరుకుంటున్నామని.. అందుకోసం అవసరమైతే ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.


వదలబోం

శాసనసభ సమావేశాల్లో సీఎం చంద్రబాబు పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, పీడీ యాక్ట్‌తో పాటు పోలీసు వ్యవస్థ బలోపేతం, మహిళా భద్రత గురించి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. మోసాలు, అక్రమాలకు ఈ చట్టంతో తెరదీశారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నల్ల చట్టాన్ని రద్దు చేశామన్నారు. దీని స్థానంలో అన్ని రాష్ట్రాలను అధ్యయనం చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. పీడీ యాక్ట్‌కు మరింత పదును పెడుతున్నామన్నారు. ప్రజాహితం కోసం పనిచేయాలని పోలీసులకు ఆయన సూచించారు. ఎంతటి వారినైనా వదలబోమని.. తప్పు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.


Also Read:

నా నోటితో చెప్పలేను.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సంచలనం..

పోసాని సంచలన నిర్ణయం.. ఇక జీవితంలో మాట్లాడను అంటూ..

తప్పు చేయాలంటే వణకాలి.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

For More Andhra Pradesh And Telugu News

Updated Date - Nov 21 , 2024 | 09:26 PM