Share News

Latest News: ఈ రోజు తాజా వార్తలు

ABN , First Publish Date - Nov 06 , 2024 | 11:15 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

Latest News: ఈ రోజు తాజా వార్తలు
Breaking News

Live News & Update

  • 2024-11-06T21:44:30+05:30

    విందు భోజనం.. సస్పెన్షన్ వేటు

    • గుంటూరు జిల్లా: బోరుగడ్డ అనిల్‌కు రెస్టారెంట్ భోజనం

    • ఏలూరులో బోరుగడ్డ అనిల్‌ను రెస్టారెంట్‌కు తీసుకెళ్ళిన పోలీసులు

    • మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో ఘటన.

    • ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేసిన ఎస్పీ సతీష్ కుమార్

  • 2024-11-06T21:23:08+05:30

    పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్స్

    • హైదరాబాద్: రాహుల్ గాంధీ కులం ఏంటని అడుగుతున్న బీజేపీ నేతలు

    • బీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

    • రాహుల్‌ది భారతదేశ కులం

    • మహేశ్వర్ రెడ్డి పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియక తికమక పడుతున్నాడు

    • కుల, మతాలకు అతీతంగా అందరూ ఇష్టపడే నాయకుడు రాహుల్ గాంధీ

    • రాహుల్ గాంధీ పదవి ఇస్తే తీసుకున్నప్పుడు ఆయన కులం తెలియదా?

    • రాహుల్ గాంధీని పిలిచి పాదయాత్ర చేసినప్పుడు రాహుల్ కులం తెలియదా?

  • 2024-11-06T21:18:07+05:30

    నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు

    • అమరావతి: నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు సుధీర్ఘ కసరత్తు

    • ఐదారు గంటలుగా సచివాలయంలో పదవుల భర్తీపై డిస్కషన్

    • వారం రోజుల్లో పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులు ప్రకటించే అవకాశం

    • అసెంబ్లీ సమావేశాలకు ముందుగా పదవుల ప్రకటించేందుకు సీఎం ప్రయత్నాలు

    • మొదటి లిస్టులో ఇచ్చిన దాని కంటే ఎక్కువగా రెండో జాబితా ఉంటుందన్న ప్రభుత్వ వర్గాలు.

    • పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన పదవులు ఇచ్చేందుకు కసరత్తు.

  • 2024-11-06T20:14:15+05:30

    • పశ్చిమ డిఎస్పీ జయరాం ప్రసాద్ కామెంట్స్

    • గుంటూరు జిల్లా: సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై పోస్టులు

    • పోస్ట్ చేసినవ్యక్తిపై నగరంపాలెంలో కేసు నమోదు

    • వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నాం

    • ఫేస్ బుక్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ఫొటో మార్ఫింగ్ చేసి పెట్టారు

    • వెంకటరామిరెడ్డిని కోర్టులో హాజరు పరిచాం

    • కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది

    • సోషల్ మీడియాలో వ్యక్తిని భంగపరిచే విధంగా మెసేజ్ ఫార్వర్డ్ ట్రోలింగ్ చేసిన వారిపై చర్యలు

    • వెంకటరామిరెడ్డిపై తాడేపల్లిలో 307 కేసు

  • 2024-11-06T19:54:21+05:30

    • ఐటీ దాడుల కలకలం

    • పశ్చిమ గోదావరి: భీమవరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిలో ఐటీ సోదాలు.

    • ఉదయం హైదరాబాద్ బయలుదేర్దిన గ్రంధి శ్రీనివాస్.

    • ఇంటిలో తనిఖీలు చేసేందుకు గ్రంధి శ్రీనివాస్‌ను వెనక్కి రావాలని కోరిన ఐటి అధికారులు.

    • మార్గమధ్యం నుంచి వెనుతిరిగి భీమవరం చేరుకున్న గ్రంధి శ్రీనివాస్.

    • గ్రంధి శ్రీనివాస్ ఇంటి వద్దకు చేరుకుంటున్న అనుచరులు

  • 2024-11-06T19:51:36+05:30

    • ఆర్వోఆర్ చట్టంపై సీఎం రేవంత్ సమీక్ష

    • హైదరాబాద్: రెవిన్యూ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

    • కొత్త ఆర్వోఆర్ చట్టంపై రివ్యూ

    • సోమవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయం

  • 2024-11-06T19:29:41+05:30

    • గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

    • హైదరాబాద్: ఈ రోజు నుంచి కుల గణన చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం

    • కుల గణన సమాచారాన్ని గవర్నర్‌కు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి

    • దేశానికి రోల్ మోడల్‌గా నిలిచేలా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

  • 2024-11-06T19:21:26+05:30

    • పరిమళించిన మానవత్వం

    • అమరావతి: మానవత్వం చాటుకున్న మంత్రి సవిత

    • తాడేపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం

    • నలుగురు మహిళలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరి పరిస్థితి విషమం

    • క్షతగాత్రులను తన వాహనంలో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలింపు

    • ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారికి పరామర్శ

    • మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు ఆదేశం

  • 2024-11-06T19:18:20+05:30

    • రాజ్ భవన్‌కు సీఎం

    • హైదరాబాద్‌: రాజ్ భవన్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

    • గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ

    • సీఎం రేవంత్ రెడ్డి వెంట ముగ్గురు మంత్రులు

  • 2024-11-06T18:25:31+05:30

    • అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ

    • ఢిల్లీ: అమిత్ షాను మర్యాదపూర్వంగా కలిసేందుకు ఢిల్లీ వచ్చా

    • డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా కలవడానికి వచ్చా: పవన్ కల్యాణ్

  • 2024-11-06T18:08:06+05:30

    ఢిల్లీలో పవన్ కల్యాణ్ బిజీ బిజీ

    • ఢిల్లీ: ఢిల్లీ చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఢిల్లీకి పయనం

    • సచివాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు రాక

    • ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అమిత్ షా నివాసానికి పవన్ కల్యాణ్

    • అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ

    • క్యాజువల్ మీటింగ్ అని స్పష్టీకరణ

    • అమిత్ షాతో సమావేశం ముగిసిన వెంటనే ఢిల్లీలో గల ఏపీ భవన్‌కు పవన్ కల్యాణ్

    • ఏపీ భవన్ నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు పవన్ కల్యాణ్

    • రాత్రి 10.40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు పవన్ కల్యాణ్

    • రోడ్డు మార్గంలో మంగళగిరి క్యాంపు కార్యాలయానికి పవన్ కల్యాణ్

  • 2024-11-06T17:38:18+05:30

    సీపీఐ నేత రామకృష్ణ కామెంట్స్

    • యురేనియంపై పోరాడుతున్న ప్రజలను పోలీసులు ఇబ్బందికు గురి చేస్తున్నారు

    • దేవనకొండ చుట్టుపక్కల ఉన్న ప్రజలు తీవ్రవాదులు, నక్సలైట్లు కాదు

    • ధర్నా చేసి యురేనియం ఆపడం ప్రజల హక్కు

    • యురేనియాన్ని ఆపడం రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తుల చేతుల్లో మాత్రమే ఉంది

    • ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే ఆపగలరు: సీపీఐ నేత రామకృష్ణ

  • 2024-11-06T17:35:26+05:30

    • మంత్రి అనగాని సత్యప్రసాద్ కామెంట్స్

    • అమరావతి: ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కీలక పరిణామం

    • రాష్ట్ర చరిత్రలో గొప్ప మైలురాయి: మంత్రి అనగాని

    • ఈ చట్టం భూములను కబ్జా చేసే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది

  • 2024-11-06T12:20:45+05:30

    ముగిసిన కేంద్ర మంత్రివర్గ సమావేశం

    • ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం

    • మంత్రివర్గ నిర్ణయాలను కాసేపట్లో వెల్లడించనున్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

    • ఏపీకి గుడ్ న్యూస్ ఉండే అవకాశం

    • కొత్త ప్రాజెక్టులు, పథకాలపై కీలక ప్రకటనలు ఉండే అవకాశం

  • 2024-11-06T11:15:00+05:30

    మాజీ వైసీపీ ఎంపీకి ఎదురుదెబ్బ

    • వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

    • మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు

    • ఇప్పటికే ఈ కేసులో గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్

  • 2024-11-06T08:45:49+05:30

    విజయసాయిరెడ్డి కామెంట్స్

    • విశాఖ ఎయిర్‌పోర్ట్: విజయవాడ నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ ఇంచార్జీ విజయసాయిరెడ్డి.

    • రెండు రోజుల్లో కూటమి నాయకులు వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వారిపై 46 కేసులు నమోదు చేశారు.

    • వందమందిని స్టేషన్‌కు తీసుకెళ్లకుండా నిర్బంధించి విచారించారు

    • 46 మందిపై కేసు నమోదు చేసి, 41ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు..

    • మీరు చేసేది తప్పు అని విజయసాయి విసుర్లు

    • రాష్ట్రంలో 20 శాతానికి పైగా కాపులు ఉన్నారు

  • 2024-11-06T08:39:04+05:30

    వర్ర రవీందర్ రెడ్డి భార్య కళ్యాణి సంచలన వ్యాఖ్యలు

    • కడప: పోలీసులు అన్యాయంగా తన భర్తను అరెస్టు చేశారు.

    • నిన్న రాత్రి 30 మంది పోలీసులు పులివెందులలో మా ఇంట్లోకి చొరబడి నా భర్తను తీసుకువెళ్లారు.

    • ఏ కేసుపై అని అడిగినా చెప్పకుండా తీసుకుని వెళ్లారు.

    • కడపకు వచ్చి పోలీసులను అడిగితే డ్రామాలు ఆడుతున్నారా అని మాపై దుర్భాషలా డుతున్నారు.

    • తన భర్త రవీందర్ రెడ్డికి ఏదైనా జరిగితే హోంమంత్రి అనిత, పోలీసులు బాధ్యత వహించాలి.