Share News

AP Politics:రోజా సైలెంట్ వెనుక కారణం అదేనా..?

ABN , Publish Date - Jul 09 , 2024 | 05:34 PM

రోజా సెల్వమణి.. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో చాలామందికి తెలిసిన పేరు. నగరి ఎమ్మెల్యేగా ఉంటూ రెండేళ్లకు పైగా టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ విపక్షాలను తిట్టే బాధ్యతను తీసుకున్నారు. అధికారంలో శాశ్వతంగా ఉండేది తామేనన్న రేంజ్‌లో స్థాయి మరిచి.. విమర్శలు చేశారు.

AP Politics:రోజా సైలెంట్ వెనుక కారణం అదేనా..?
RK Roja

రోజా సెల్వమణి.. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో చాలామందికి తెలిసిన పేరు. నగరి ఎమ్మెల్యేగా ఉంటూ రెండేళ్లకు పైగా టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీ (YSRCP) అధికారంలో ఉన్న ఐదేళ్లూ విపక్షాలను తిట్టే బాధ్యతను తీసుకున్నారు. అధికారంలో శాశ్వతంగా ఉండేది తామేనన్న రేంజ్‌లో స్థాయి మరిచి.. విమర్శలు చేశారు. రాజకీయంగా తనకు అవకాశాలు కల్పించిన వ్యక్తులపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐదేళ్లు గడిచాయి.. సీన్ రివర్స్ అయింది. ఐదేళ్లు బిగ్గరగా అరిచిన గొంతు.. మూగబోయింది. మైకులు నోటి ముందు పెట్టినా మాట్లాడని పరిస్థితిలో రోజా ఉన్నారు. ఐదేళ్లపాటు వైసీపీ కోసం నోరుపారేసుకున్న రోజాను ప్రస్తుతం పార్టీ పట్టించుకోవడంలేదట. దీంతో ఆర్కే రోజా (RK Roja) తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని.. ఇక తన పొలిటికల్ కేరీర్ క్లోజ్ అయినట్లేనన్న చర్చ జరుగుతోంది.

CM Chandrababu: విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. అసలు లెక్కలు ఇవే


ఎన్నికల తర్వాత..

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. రోజా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌తో పాటు.. టీడీపీ సీనియర్ నేతలపై అనవసరంగా నోరుపారేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారం ఉందనే అహంతో ప్రవర్తించారని.. విపక్షాలకు కనీస గౌరవం ఇవ్వలేదనేది అక్షర సత్యం. అయితే.. ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రతికూలంగా రావడంతో రోజా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వందశాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించడంతో రోజాను జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేశారు. మా నాయకుడిపై చేసిన ఆరోపణలకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతావంటూ వందల సంఖ్యలో ప్రశ్నలు సంధించారు. పార్టీలతో సంబంధం లేకుండా కొంతమంది ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. అయినా రోజా నోరు మెదపడం లేదు.. పోని ఆమెకు పార్టీ సైతం మద్దతు ఇవ్వకపోవడంతో రోజా సైతం పొలిటికల్‌గా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. రోజాపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్నా.. పార్టీ నుంచి ఎటువంటి మద్దతు లభించడంలేదట. మరోవైపు ఈవీఎంలను పగలకొట్టి అడ్డంగా దొరికిపోయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అండగా నిలిచిన జగన్.. తన విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉండటంతో రోజా సెల్వమణి పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారట. ఐదేళ్లపాటు పార్టీ చెప్పిందే చేసినా.. ఇప్పుడు తనను ఒంటరిని చేయడంపై ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది.

AP Cabinet: జులై 16న ఏపీ కేబినెట్ సమావేశం.. ఏం జరుగుతుందో..?


పార్టీ నేతలపై..

ఎన్నికల సమయంలోనే రోజా పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. తన ఓటమికోసం కొందరు నేతలు పనిచేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో తన అధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడంతో.. రోజాకు అడ్డుకుట్ట వేసేందుకు కొందరు వైసీపీలో ముఖ్య నాయకులు పనిచేశారనే ప్రచారం జరిగింది. దీనిపై రోజా పార్టీ అధిష్టానానికి చెప్పినా పట్టించుకోలేదని.. తనను నిర్లక్ష్యం చేశారని ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వైసీపీని వీడి బయటకు వెళ్దామంటే ఇతర పార్టీల్లో చేరే అవకాశం లేకపోవడంతో.. చేసేదేమిలేక ఆ పార్టీలోనే ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


NTTPS Accident: ఎన్టీటీపీఎస్ ప్రమాదంపై విచారణ చేస్తాం: మంత్రి వాసంశెట్టి..

SLBC Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్‌బీసీ సమావేశం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh and Telangana News

Updated Date - Jul 09 , 2024 | 05:34 PM