Share News

Chandrababu Cabinet: డిప్యూటీ సీఎం పవన్‌.. ఎవరికి ఏ శాఖలు..?

ABN , Publish Date - Jun 15 , 2024 | 06:34 AM

సుదీర్ఘ కసరత్తు జరిపిన సీఎం చంద్రబాబు.. తన సహచర మంత్రుల కు శాఖలు కేటాయించారు. అందరూ ఊహించినట్లే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టారు. కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ

Chandrababu Cabinet: డిప్యూటీ సీఎం పవన్‌.. ఎవరికి ఏ శాఖలు..?

  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు

  • అచ్చెన్నాయుడికి వ్యవసాయం

  • మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు

  • పయ్యావులకు ఆర్థిక, సభా వ్యవహారాలు

  • సత్యప్రసాద్‌కు రెవెన్యూ, నిమ్మలకు జలవనరులు

  • ఎక్సైజ్‌, గనులు కొల్లుకు.. వైద్యం సత్యకుమార్‌కు

  • మనోహర్‌కు పౌరసరఫరాలు.. సవితకు బీసీ సంక్షేమం

  • ఆనంకు దేవదాయం.. రాంప్రసాద్‌రెడ్డికి రవాణా

  • పరిశ్రమలు భరత్‌కు.. కార్మిక శాఖ సుభాష్‌కు

అమరావతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘ కసరత్తు జరిపిన సీఎం చంద్రబాబు.. తన సహచర మంత్రుల కు శాఖలు కేటాయించారు. అందరూ ఊహించినట్లే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టారు. కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా.. పర్యావరణం, అడవులు.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలను ఆయనకు కేటాయించారు. నారా లోకేశ్‌కు మానవ వనరులు, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌-కమ్యూనికేషన్స్‌ శాఖలతో పాటు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌(ఆర్‌టీజీ) కూడా అప్పగించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన అచ్చెన్నాయుడికి వ్యవసాయం, మార్కెటింగ్‌, సహకారం, పాడిపరిశ్రమ, మత్స్యశాఖలు లభించాయి.

కీలకమైన హోం శాఖను దళిత (మాదిగ) వర్గానికి చెందిన మహిళ వంగలపూడి అనితకు.. ఆర్థిక, వాణిజ్య పన్నులు, ప్రణాళికా శాఖలతో పాటు శాసనసభ వ్యవహారాలను పయ్యావుల కేశవ్‌కు.. రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లను అనగాని సత్యప్రసాద్‌కు కేటాయించారు. ఇతర ముఖ్య శాఖల్లో జలవనరుల శాఖను నిమ్మల రామానాయుడికి.. ఆహార-పౌరసరఫరాలు నాదెండ్ల మనోహర్‌కు, రాజధాని అమరావతి నిర్మాణంపై అవగాహన ఉన్న పొంగూరు నారాయణకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు.. బీజేపీకి చెందిన సత్యకుమార్‌కు వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ కేటాయించారు. ఇక సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజె్‌సతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి.

పవన్‌కు, మంత్రివర్గానికి బాబు అభినందనలు

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ మేర కు ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు. అలాగే కేబినెట్‌ సహచరులకు శాఖలు కేటాయించిన సందర్భంగా ప్రజా సేవలో నిమగ్నం కానున్న మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మం త్రులుగా సేవలందించి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. కాగా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, అధికార ప్రతినిధి మాల్యాద్రి అభినందించారు. మంత్రి అయిన తర్వాత టీడీపీ పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆమెకు వర్ల రామయ్య శాలువా కప్పి సన్మానించారు.

మంత్రులకు శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

1. చంద్రబాబునాయుడు : సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌

మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు..

2. పవన్‌ కల్యాణ్‌ : పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక శాఖలు

3. నారా లోకేశ్‌ : మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌–కమ్యూనికేషన్స్‌, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌

4. కింజరాపు అచ్చెన్నాయుడు : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్య శాఖ

5. కొల్లు రవీంద్ర : గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్‌

6. నాదెండ్ల మనోహర్‌ : ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు

7. పొంగూరు నారాయణ : పురపాలక, పట్టణాభివృద్ధి

8. వంగలపూడి అనిత : హోం, విపత్తు నిర్వహణ

9. సత్యకుమార్‌ : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య

10. నిమ్మల రామానాయుడు : జలవనరుల శాఖ

11. ఎన్‌ఎండీ ఫరూక్‌ : న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం

12. ఆనం రామనారాయణరెడ్డి : దేవదాయ శాఖ

13. పయ్యావుల కేశవ్‌ : ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు

14. అనగాని సత్యప్రసాద్‌ : రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు

15. కొలుసు పార్థసారథి : గృహ నిర్మాణం, సమాచార–పౌరసంబంధాలు

16. డోలా బాలవీరాంజనేయ స్వామి : సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం

17. గొట్టిపాటి రవికుమార్‌ : విద్యుత్‌

18. కందుల దుర్గేశ్‌ : పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ

19. గుమ్మడి సంధ్యారాణి : మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం

20. బీసీ జనార్దన్‌రెడ్డి రోడ్లు : భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు

21. టీజీ భరత్‌ : పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి

22. ఎస్‌.సవిత : బీసీ సంక్షేమం, ఆర్థికంగావెనుకబడినవారి సంక్షేమం, జౌళి, వస్త్ర పరిశ్రమ

23. వాసంశెట్టి సుభాష్‌ : కార్మిక, కర్మాగార, బాయిలర్స్‌, వైద్య బీమా సేవలు

24. కొండపల్లి శ్రీనివాస్‌ : ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై సాధికారత, సంబంధాలు

25. ఎం.రాంప్రసాద్‌రెడ్డి : రవాణా, యువజన సర్వీసులు, క్రీడలు

Updated Date - Jun 15 , 2024 | 07:46 AM