Share News

Duvvada Srinivas: చాలా కతలే ఉన్నాయ్.. మాధురిపై వాణి సంచలన కామెంట్స్..!

ABN , Publish Date - Aug 10 , 2024 | 04:16 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎమ్మెల్సీ కుటుంబ వ్యవహారం ఇప్పుడు రచ్చ చేస్తోంది. పర్సనల్ వివాదాలు కాస్తా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అదే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ రిలేషన్‌షిప్. ఇంట్లో ప్రియురాలు.. ఆ పక్కింట్లో ఇల్లాలు అన్నట్లుగా ఉంది దువ్వాడ యవ్వారం.

Duvvada Srinivas: చాలా కతలే ఉన్నాయ్.. మాధురిపై వాణి సంచలన కామెంట్స్..!
Duvvada Srinivas

శ్రీకాకుళం, ఆగష్టు 10: ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎమ్మెల్సీ కుటుంబ వ్యవహారం ఇప్పుడు రచ్చ చేస్తోంది. పర్సనల్ వివాదాలు కాస్తా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అదే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ రిలేషన్‌షిప్. ఇంట్లో ప్రియురాలు.. ఆ పక్కింట్లో ఇల్లాలు అన్నట్లుగా ఉంది దువ్వాడ యవ్వారం. ఈ విషయంపైనే శ్రీనివాస్ ఇంటి ముందు ఆయన భార్య, కుమార్తెల నిరసన వ్యక్తం చేస్తున్నారు. భార్య, కూతుళ్లని చూసి ఇంటి గేటు వేసుకుని లోపలే ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ను ఆయన కుటుంబ సభ్యులు నిలదీశారు. తన భర్త వివాహేతర సంబంధం కారణంగా పరువు పోతోందని భార్య వాణి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు.. ఒక మహిళ కారణంగా తమ తండ్రి తమకు దూరంగా ఉంటున్నారని ఆయన కూతురు హైందవి ఆవేదన వ్యక్తం చేస్తోంది.


అయితే, ఈ వివాదానికి కారణమైన మాధవి.. దువ్వాడ వాణిపై తీవ్ర ఆరోపణలు చేయగా.. వాణి స్ట్రాంగ్ కౌంట్ ఇచ్చారు. కుటుంబాలను కూల్చే బాపతు మాధవి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను మాధవిని రాజకీయాల్లోకే తీసుకురాలేదని స్పష్టం చేశారు వాణి. వాస్తవానికి తాను దేవయాని అనే క్యాండిడెట్‌ను ప్రపోజ్ చేశానని వాణి తెలిపారు. మాధురి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. ఇతరుల జీవితాతల్లో ప్రవేశించి.. కుటుంబాలను నాశనం చేయడమే మాధురి పని అని విమర్శించారు. తమ జీవితంలోకి రాకముందు.. అనేక మంది జీవితాలను ఇలాగే నాశనం చేసిందని వాణి ఆరోపించారు. అందుకే.. మాధురి బాధితులంతా ఇప్పుడు ఆమెపై అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇదే విషయంలో చాలా మంది తనకు ఫోన్ చేసి చెప్పారని, మాధురి తమ జీవితాలను కూడా నాశనం చేసిందని ఆరోపించారని వాణి చెప్పారు.


వాస్తవానికి ఈ వివాదం అప్పటి సీఎం జగన్ వరకు వెళ్లిందన్నారు వాణి. ఓ రోజు శ్రీనివాస్ ఫోన్‌ను ట్రాక్ చేయగా.. వీరి ఇల్లీగల్ రిలేషన్ గుట్టు రట్టయ్యిందన్నారు. చిన్న కూతురుకు విషయం తెలియడంతో ఆమెను నడిరోడ్డుపై వదిలేసి కారులో తన భర్త శ్రీనివాస్ ఒక్కడే వెళ్లాడని చెప్పుకొచ్చింది. ఆ తరువాత శ్రీనివాస్ వారం రోజుల పాటు అడ్రస్ లేకుండా పోయారని చెప్పింది. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారని, ఇంటికి రాలేదని వాణి వాపోయింది. శ్రీనివాస్ తీరుతో తాను డిప్రెషన్‌లోకి వెళ్లగా.. విశాఖలోని తన పెద్ద కూతురు తమ ఇంటికి రమ్మంటే వెళ్లానని చెప్పింది. శ్రీనివాస్, మాధురి తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.


మాధురి ఆరోపణలు..

దువ్వాడ వాణి తనను ట్రాప్ చేసి.. తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని మాధురి ఆరోపించింది. శ్రీనివాస్‌లో స్నేహంగా ఉండేదానని చెప్పుకొచ్చింది. ఎమ్మెల్యే టికెట్ కోసం దువ్వాడ వాణి తను బ్యాడ్ చేసిందని మాధురి ఆరోపించింది. అవిడ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని అన్నారు. తమ మధ్య ఇల్లీగర్ రిలేషన్ లేదని చెబుతోంది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 10 , 2024 | 04:16 PM