Share News

AP News: పడవ ప్రమాదంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

ABN , Publish Date - Jul 30 , 2024 | 11:30 AM

Andhrapradesh: జిల్లాలోని పి.గన్నవరం ఊడిమూడి వద్ద పడవ ప్రమాదంలో గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. చదలవాడ విజయ్ కృష్ణ (26) మృతదేహాన్ని స్థానికులు వెలికి తీశారు. ఈనెల 28వ తేదీన ఊడిమూడిలంక వరద బాధితులకు వాటర్ ప్యాకెట్లు బస్తాలు తీసుకువెళ్తున్న నాటుపడవ గోదావరిలో మునిగిపోయింది. ఈ పడవలో ప్రయాణిస్తున్న విజయ్ కృష్ణ గల్లంతయ్యాడు. గత మూడు రోజులుగా విజయ్ కోసం గాలించగా...

AP News: పడవ ప్రమాదంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
Ambedkar Konaseema District

అంబేద్కర్ కోనసీమ జిల్లా, జూలై 30: జిల్లాలోని పి.గన్నవరం ఊడిమూడి వద్ద పడవ ప్రమాదంలో గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. చదలవాడ విజయ్ కృష్ణ (26) మృతదేహాన్ని స్థానికులు వెలికి తీశారు. ఈనెల 28వ తేదీన ఊడిమూడిలంక వరద బాధితులకు వాటర్ ప్యాకెట్లు బస్తాలు తీసుకువెళ్తున్న నాటుపడవ గోదావరిలో మునిగిపోయింది. ఈ పడవలో ప్రయాణిస్తున్న విజయ్ కృష్ణ గల్లంతయ్యాడు. గత మూడు రోజులుగా విజయ్ కోసం గాలించగా... ఈరోజు మృతదేహం లభ్యమైంది. అధికారుల నిర్లక్ష్యమే చదలవాడ విజయ్ కృష్ణను బలితీసుకుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నదీ పాయపై పడవ ప్రయాణానికి నాలుగు లంక గ్రామాల ప్రజలు భయపడిపోతున్న పరిస్థితి. బోట్లలో రక్షణ కోసం ఎన్డీఆర్ఎప్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

TPCC Chief: కొలిక్కొచ్చిన టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ.. ప్రకటన ఎప్పుడంటే..!?


ఇదీ జరిగింది...

కాగా..ఈనెల 28న వరద ప్రభావిత లంక గ్రామాల ప్రజలకు వాటర్ ప్యాకెట్లు తీసుకెళ్తున్న క్రమంలో పడవ బోల్తా పడిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో పడవలో మొత్తం ఆరుగురు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పడవలో ఉన్నవారిలో ఐదుగురిని రక్షించగా... ఒకరు గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి బయటపడ్డవారంతా లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. విజయ్ కృష్ణ అనే యువకుడు గల్లంతవగా.. ఈరోజు అతడి మృతదేహం లభ్యంకావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ కృష్ణ కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. నదిలో వరద ఉధృతి తగ్గే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి లంక గ్రామాల ప్రజలకు సూచనలు చేశారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ అక్కడకు చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.


ఇవి కూడా చదవండి...

Drugs Case: సంచలనం సృష్టించిన విశాఖ డ్రగ్స్ కేసు ఏమైంది?

TPCC Chief: కొలిక్కొచ్చిన టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ.. ప్రకటన ఎప్పుడంటే..!?

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 30 , 2024 | 11:33 AM