AP Politics: మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో వీడిన చిక్కుముడి..
ABN , Publish Date - Jul 04 , 2024 | 09:30 PM
సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ (Former MP Margani Bharat) ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో చిక్కుముడి వీడింది. నిందితుడు, వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు.
రాజమహేంద్రవరం: సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్(Former MP Margani Bharat) ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో చిక్కుముడి వీడింది. నిందితుడు, వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీ(Dangeti Shivaji)ని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 28(శనివారం)న వి.ఎల్.పురంలోని మార్గాని ఎస్టేట్స్ కార్యాలయంలో ప్రచార రథాన్ని అదే గ్రామానికి చెందిన శివాజీ తగలబెట్టాడు. మాజీ ఎంపీ భరత్ తండ్రి నాగేశ్వరరావుకు శివాజీ ముఖ్య అనుచరుడు. తాజాగా జరిగిన ఎన్నికల్లో భరత్ ఓడిపోవడంతో ప్రజల్లో సానుభూతి, టీడీపీకి చెడ్డ పేరు తెచ్చేందుకే రథాన్ని తగలబెట్టాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి వైసీపీ కార్యకర్త శివాజీనే రథాన్ని తగలబెట్టాడని గుర్తించి అరెస్టు చేశారు.