Share News

Pawan Kalyan: ఉప్పాడలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Jul 03 , 2024 | 12:16 PM

కాకినాడ జిల్లా: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో మూడో రోజు బుధవారం పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం 10.45 కు ఉప్పాడలో పర్యటిస్తున్నారు. తీరంలో సముద్రపు కోతను ఆయన పరిశీలిస్తున్నారు. అనంతరం హార్బర్ సముద్ర మొగ వద్ధ మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.

Pawan Kalyan: ఉప్పాడలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం

కాకినాడ జిల్లా: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) కాకినాడ జిల్లాలో మూడో రోజు బుధవారం పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం 10.45 కు ఉప్పాడలో (Uppada) పర్యటిస్తున్నారు. తీరంలో సముద్రపు కోతను ఆయన పరిశీలిస్తున్నారు. అనంతరం హార్బర్ సముద్ర మొగ వద్ధ మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో వారాహి బహిరంగ సభ (Varahi public meeting) జరగనుంది. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి విజయవాడకు ప్రయాణమవుతారు.


ఉప్పాడ తీరం ధ్వంసం కాకుండా చర్యలు

ఉప్పాడ తీరంలో ఏడాదిన్నర కాలంగా ఎకరం భూభాగం సముద్రపు కోతలో కలిసిపోయిందని. ఇలా ధ్వంసం కాకుండా అన్ని చర్యలు తీసు కుంటున్నామని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. బుధవారం చెన్నై నుంచి వచ్చే నిపుణుల బృందం ఉప్పాడ తీరాన్ని పరిశీలించి దాన్ని రక్షణకు అవసరమైన చర్యలు సూచిస్తుందన్నారు. తద్వారా తీర సంరక్షణ చేపడు తున్నట్టు చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కేరళలో అధ్యయనం చేసిన తర్వాత కోనసీమలో కొబ్బరి ఉత్పత్తులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధుల సాయంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సైన్సు అండ్‌ టెక్నాలజీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే నన్నయ్య యూనివర్సిటీలో ఉన్న రీసెర్చ్‌ స్కాలర్లను తీసుకెళ్లి ఉప్పాడ తీర సం రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తామని చెప్పారు.


కాగా కాకినాడ కలెక్టరేట్‌ వివేకానంద సమావేశ మందిరంలో మంగళవారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ శాఖ, పర్యావరణశాఖలపై అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. నాలుగు గంటల పాటు జరిగిన సమీక్షలో అన్ని అంశాలపై వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న జలజీవన్‌ మిషన్‌ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని అన్ని గ్రామాలకు రక్షిత తాగునీరందిస్తామని చెప్పారు. జనావాసాల్లో ఉన్న తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి తూర్పు గోదా వరి జిల్లాలో ఏడాదికి వెయ్యి కోట్ల ఇసుక వ్యాపారం జరిగిందని ఐదేళ్లలో రూ.5 వేల కోట్ల రాబడి వచ్చినా జగన్‌ ప్రభుత్వం మాత్రం పంచాయతీల నిధులకు గండి కొట్టిందన్నారు. గనుల సీనరేజీ నిధులు సైతం ఇవ్వ కుండా దారి మళ్లించారని వీటన్నింటిపై అధికారులను నివేదిక కోరినట్టు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చెప్పారు.


గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుకుని పంచాయ తీలకు చిల్లిగవ్వ కూడా పన్ను చెల్లించలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ పరిస్థితిని మార్చి ఉమ్మడి జిల్లాలో అన్ని పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి కలిగేలా చేస్తామన్నారు. కాకినా డకు అతి సమీపంలో ఉన్న కోరంగి మడ అడవులను గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరుతో ధ్వంసం చేసిందని, వేల టన్నుల కంకరతో మడ భూములను చదునుచేసిందని, దీనివల్ల మడ అడవుల్లో ఉండే జీవరాశులు మనుగడ కోల్పోయే ప్రమాదం వాటిల్లిందన్నారు. తిరిగి మడ అడవుల అభివృద్ధికి చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. కోరంగిలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు.ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కాకినాడ సముద్ర తీరంలో ఉన్న హోప్‌ ఐలాండ్‌ను సంరక్షిస్తామని, అక్క డున్న జీవులను కాపాడేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. కాకినాడ స్మార్ట్‌ సిటీకి సంబంధించి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనుల విష యంపై ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్‌ కేంద్రంతో మాట్లాడతారని తెలిపారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. సముద్రతీరాన్ని రక్షించే మడ అడవులను వైసీపీ పాలనలో నాశనం చేసి ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు. హానికరమైన మలేషియన్‌ బ్రీడ్‌ రకం కోనో కార్పస్‌ మొక్కలను పచ్చదనం కోసం పెంచారని, వాటిని దశలవారీగా తొలగిస్తామని చెప్పారు. ఉప్పాడ తీరప్రాంతంలో సముద్రపు కోత వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని, దాని పరిశీలనకు తాను బుధవారం వెళ్లనున్నట్టు తెలిపారు. చెన్నైకు చెందిన ని పుణుల బృందం పరిశీలనకు వస్తున్నట్టు చెప్పారు. వనాలు, జీవజాతుల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములు చేయాలని సూచించారు. వ్యవస్థలను అన్నింటినీ గాడిలో పెడతామని తెలిపారు. సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టరు సగిలి షాన్‌మోహన్‌, జేసీ రామసుందరరెడ్డి, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, ఎస్పీ సతీష్‌కుమార్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌ రెడ్డితో జర్మనీ ప్రతినిధుల భేటీ

హత్రాస్ ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు..

ఏపీఎండీసీలో వైసీపీ దందా..!

అమరావతి రాజధానిపై నేడు శ్వేతపత్రం విడుదల

ఏపీలో పేదలకు ఇసుక ఉచితం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 03 , 2024 | 12:19 PM