Andhra Pradesh: ఏజెంట్ చేతిలో మోసపోయిన ఏపీ వాసి.. స్వదేశానికి తీసుకొస్తానంటూ హామీ..
ABN , Publish Date - Jul 20 , 2024 | 11:14 AM
ఏజెంట్ల చేతిలో మోసపోతూ ఎంతో మంది తెలుగువాళ్లు విదేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కువైట్‌లో చిక్కుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు లోకేష్ తీవ్రంగా కృషి చేశారు.
ఏజెంట్ల చేతిలో మోసపోతూ ఎంతో మంది తెలుగువాళ్లు విదేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కువైట్‌లో చిక్కుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు లోకేష్ తీవ్రంగా కృషి చేశారు. కువైట్‌లోని భారత రాయబారం కార్యాలయంతో మాట్లాడి ఆ యువకుడిని స్వదేశానికి తీసుకొచ్చారు. తాజాగా ఏపీకి చెందిన మరో వ్యక్తి సౌదీ అరేబియా ఏడారిలో చిక్కుకున్నానంటూ ఓ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏజెంట్ చేతిలో మోసపోయానని.. తన పరిస్థితి బాగోలేదంటూ.. ఎవరైనా సాయం చేయాలంటూ ప్రధేయపడ్డాడు. ఈ వీడియో చూసిన ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. ధైర్యంగా ఉండాలని.. వీరేంద్రను స్వదేశానికి తీసుకొచ్చే బాధ్యత తనదంటూ భరోసా ఇచ్చారు. డోంట్‌వర్రీ.. నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకొస్తామని లోకేష్ ట్వీట్ చేశారు.
ఎవరీ వీరేంద్ర..
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు చెందిన సరేళ్ల వీరేంద్రకుమార్ స్వస్థలం అంబాజీపేట మండలం ఇసుకపూడి. ఉపాధి కోసం ఏజెంట్ మాటలు నమ్మి ఖతర్ వెళ్లాడు. ఖతర్‌లో మంచి ఉద్యోగం ఉందని చెప్పడంతో వీరేంద్రకుమార్ వీసా కోసం ఏజెంట్‌కు రూ.1,70,000 చెల్లించాడు. వీరేంద్రకుమార్ డబ్బులు కట్టడంతో ఖతర్‌కు వీసా ఇప్పించాడు. ఈనెల 10న వీరేంద్ర ఖతర్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఓ వ్యక్తి 11వ తేదీన సౌదీ అరేబియా ఏడారి ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశాడు. దీంతో తాను మోసపోయానని వీరేంద్ర గుర్తించాడు. చివరికి తన దగ్గర ఉన్న ఫోన్‌లో వీడియో తీసి తన కుటుంబ సభ్యులకు పంపించాడు. దీనిని మిత్రుల సహాయంతో ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో నారా లోకేష్ దీనిని చూశారు. వెంటనే స్పందించిన లోకేష్ వీరేంద్రను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.
‘పుంగనూరు’లో పెద్దిరెడ్డి సేవలో..
తన కష్టాలు చెప్పుకుంటూ వీడియో..
తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. కనీసం తాగడానికి నీళ్లు లేవంటూ వీరేంద్ర వీడియోలో చెప్పుకొచ్చాడు. ఒంటెలు ఉండే గుడారాల వద్ద తనను వదిలేశారని.. ఇక్కడ ఉండటానికి ఎలాంటి సదుపాయాలు లేవని వీరేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఖతర్ తీసుకెళ్తానని చెప్పిన వ్యక్తి సౌదీలో తన దగ్గర నాలుగు రోజులు ఉంచుకుని.. ఆ తర్వాత ఏడారి ప్రాంతంలో విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు వీడియోలో వీరేంద్ర చెప్పుకొచ్చాడు. తనకు రక్తపు వాంతులు అవుతున్నాయని, ముక్కులోంచి రక్తం వస్తుందని.. ఇదే పరిస్ధితి కొనసాగితే తాను మరో 10 రోజుల్లో చచ్చిపోయే అవకాశం ఉందని చెప్పాడు. ఎవరైనా తనపై దయతోఇక్కడి నుంచి స్వస్థలానికి చేర్చే ప్రయత్నం చేయాలని వీరేంద్రకుమార్ కోరాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News