Share News

Big Breaking: ఏపీలోని మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం

ABN , Publish Date - May 18 , 2024 | 05:01 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలు రణరంగంగా మారిన పరిస్థితి. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్రజేసి ఆయా జిల్లాల ఎస్పీలు, పలువురు పోలీసు ఉన్నతాధికారులపై వేటు వేసింది.

Big Breaking: ఏపీలోని మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం

అమరావతి, ఆంధ్రజ్యోతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఎన్నికల తర్వాత కూడా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలు రణరంగంగా మారిన పరిస్థితి.! దీంతో ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్రజేసి ఆయా జిల్లాల ఎస్పీలు, పలువురు పోలీసు ఉన్నతాధికారులపై వేటు వేసింది. ఇందులో పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలకు చెందిన ఎస్పీలు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ఏపీలో అసలేం జరుగుతోందని రాష్ట్ర సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించుకున్న ఈసీ సమగ్ర నివేదిక కోరడం జరిగింది. మరోవైపు సిట్ కూడా ఏపీలోకి దిగిపోయింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే మూడు జిల్లాలకు కొత్త పోలీస్ బాస్‌లను కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించడం జరిగింది.

వైసీపీ పోలీసింగ్‌పై కొరడా!



కొత్త ఖాకీ బాస్‌లు వీరే!

పల్నాడు జిల్లాకు మల్లికా గర్గ్, తిరుపతి జిల్లాకు హర్షవర్ధన్, అనంతపురం జిల్లాకు గౌతమి శాలిని నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి సీఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

cec-jawahar.jpg

కాగా.. తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన అల్లర్లపై వెంటనే చర్యలు చేపట్టిన ఈసీ మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది. దీంతో ఈ పోస్ట్‌లు ఖాళీ అయ్యాయి. ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికారులు లేరని.. మూడు పోస్టులకు ఏపీ ప్రభుత్వం ఐదుగురు పేర్లతో కూడిన ప్యానల్‌ను పంపించింది. ఒక్కో ఎస్పీ పోస్ట్‌కు ముగ్గురు పేర్ల చొప్పున ప్యానల్ పంపాల్సిందేనని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక్కో ఎస్పీ పోస్ట్‌కు ముగ్గురేసి అధికారుల పేర్లను సీఎస్ పంపడం జరిగింది. అనంతరం.. పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీలుగా ముగ్గుర్ని నియమించడం జరిగింది. ఇదిలా ఉంటే.. పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీని ఎన్నికల కమిషన్ శనివారం నాడే నియమించింది.

Updated Date - May 18 , 2024 | 06:06 PM