Share News

AP Elections 2024: ముగిసిన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు.. ట్విస్ట్ ఏమిటంటే..?

ABN , Publish Date - Apr 29 , 2024 | 03:40 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ( AP Elections 2024)ల్లో కీలక ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ల స్వీకరణ గడువు ఏప్రిల్ 25వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.

AP Elections 2024: ముగిసిన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు.. ట్విస్ట్ ఏమిటంటే..?

అమరావతి, ఆంధ్రజ్యోతి, ఏప్రిల్-29: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections 2024) కీలక ఘట్టం ముగిసింది. సార్వత్రిక ఎన్నికలకు గానూ నామినేషన్ల (AP Nominations) ఉపసంహరణకు గడువు నేటితో (ఏప్రిల్- 29) ముగిసింది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో పార్టీలు బీఫామ్‌లు దక్కించుకున్న నేతలతో పాటు.. రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఈ అభ్యర్థుల నామినేషన్ల విత్ డ్రాకు ఎన్నికల కమిషన్ (Election Commission) ఇచ్చిన సమయం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.


CM Jagan: అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ సిద్ధం సభ

ఎన్ని నామినేషన్లు వచ్చాయ్..?

ఇదిలా ఉంటే.. 25 పార్లమెంటు స్థానాలకు 503 నామినేషన్లు రాగా.. 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. ఒకే కుటుంబం నుంచి ఇండిపెండెంట్‌గా నామినేష‌న్ వేసిన ప‌లువురు అభ్యర్థులను ఈసీ ఆమోదించలేదు. అత్యధికంగా నంద్యాల పార్లమెంటుకు 36 నామినేషన్లు రాగా, అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి 12 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.


అసెంబ్లీకి ఇలా..?

ఇక.. అసెంబ్లీ స్థానాల‌కు తిరుపతి నుంచి అత్యధికంగా 48 నామినేషన్లు దాఖలు కాగా.. అత్యల్పంగా చోడవరం స్థానానికి 6 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ తెలిపింది. కాసేప‌ట్లో నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ‌పై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా మీడియా ముందుకు రానున్నారు. నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ త‌ర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థుల‌కు ఆర్వోలు గుర్తులు కేటాయించ‌నున్నారు. ఇక మే- 13న ఒకే విడతలో ఆంధప్రదేశ్ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.


AP Elections: వైసీపీ ఆశలన్నీ వాళ్లపైనే.. తేడా వస్తే ఫ్యాన్ ఫ్యూజులౌట్..

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 29 , 2024 | 04:27 PM