Share News

AP News: జగన్ ప్రభుత్వం నన్ను మానసిక క్షోభకు గురిచేసింది: సూర్యనారాయణ

ABN , Publish Date - May 19 , 2024 | 08:20 PM

వైసీపీ (YSRCP) ప్రభుత్వం వల్ల ఉద్యోగ సంఘాలు చాలా నష్టపోయాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం ఐక్యవేదిక సంఘాల రాష్ట్ర చైర్మన్ కె.ఆర్ సూర్యనారాయణ (KR Suryanarayana) అన్నారు. ఉద్యోగుల జీపీఎస్ సొమ్మును తమకు తెలియకుండా తమ ఖాతాల నుంచి రూ. 500 కోట్లను వైసీపీ ప్రభుత్వం దొంగతనం చేసిందని ఆరోపించారు.

AP News: జగన్ ప్రభుత్వం నన్ను మానసిక క్షోభకు గురిచేసింది: సూర్యనారాయణ
మెమోరాండం

పశ్చిమగోదావరి: వైసీపీ (YSRCP) ప్రభుత్వం వల్ల ఉద్యోగ సంఘాలు చాలా నష్టపోయాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం ఐక్యవేదిక సంఘాల రాష్ట్ర చైర్మన్ కె.ఆర్ సూర్యనారాయణ (KR Suryanarayana) అన్నారు. ఉద్యోగుల జీపీఎస్ సొమ్మును తమకు తెలియకుండా తమ ఖాతాల నుంచి రూ. 500 కోట్లను వైసీపీ ప్రభుత్వం దొంగతనం చేసిందని ఆరోపించారు. భీమవరంలో ఆదివారం పలు సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కె.ఆర్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... . తాను నేరుగా ఆరోపణ చేస్తున్న ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగులకు సమాధానం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.


గతంలో ఈ ఆర్థికపరమైన చెల్లింపులకు ఒక చట్టాన్ని రూపొందించమని ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌‌ను కలిసి మెమోరాండం ఇచ్చామని తెలిపారు. గవర్నర్‌ను కలిసి మెమోరాండం ఇవ్వడాన్ని నేరంగా భావించిందని చెప్పారు. వ్యక్తిగతంగా తనను, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలను చిన్నాభిన్నం చేసి తన కుటుంబాన్ని మానసికక్షోభకు ఈ ప్రభుత్వం గురిచేసిందని విరుచుకుపడ్డారు. ఇది జగన్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని చెప్పారు. ప్రభుత్వ స్పాన్సర్ సంఘాలు కూడా కొన్ని ఉన్నాయిని.. ఉద్యోగస్తుల్లో కొన్ని సంఘాలు ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన చేస్తున్నాయని విమర్శించారు. ఉద్యోగుల్లో చైతన్య నింపడం కోసమే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామని సూర్యనారాయణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం జగన్‌పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..

కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

తమిళనాడులో ‘రెడ్ అలర్ట్’ జారీ

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 19 , 2024 | 09:08 PM