Share News

AP Elections 2024: మేనిఫెస్టోలో వాటిపైనే ఫోకస్ పెట్టాం: బొత్స సత్యనారాయణ

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:49 PM

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో‌పై మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. పేద వాడి జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని అన్నారు.

 AP Elections 2024: మేనిఫెస్టోలో వాటిపైనే ఫోకస్ పెట్టాం:  బొత్స సత్యనారాయణ
Minister Botsa Satyanarayana

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో‌పై మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. పేద వాడి జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని అన్నారు.


AP Elections: కొత్త స్కీం లేదు.. మెరుపులు లేవు.. తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో

మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని తమ నాయకుడు జగన్ చెప్పారన్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులాగా వారి మేనిఫెస్టో పేరుతో తాము దగా చేయమన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయంపై ఈ ఐదేళ్లు ఫోకస్ పెట్టామని ఉద్ఘాటించారు. వచ్చే ఐదేళ్లు కూడా వాటిపై దృష్టి పెడతామన్నారు. మేనిఫెస్టోలో ఉన్న 99 శాతం హామీలను నెరవేర్చిన ఏకైక పార్టీ వైసీపీనే అని తెలిపారు. దేశ రాజకీయాల్లో ఏ పార్టీ ఇంత పెద్ద మొత్తంలో మేనిఫెస్టోని అమలు చేయలేదన్నారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని విరుచుకుపడ్డారు.


AP Elections 2024: రాజధానిపై జగన్ నిర్ణయం ఇదే.. అమరావతిపై మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే!

డ్వాక్రా మహిళలకు కూడా బకాయిలను చెల్లించామన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ రాజధాని అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారని వివరించారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేది సీఎం జగన్ కల అని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోనే రిఫరెండంగా తీసుకుంటున్నామన్నారు. రూ. 25 వేల లోపు జీతం ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నవరత్నాలు అందించడం శుభపరిణామమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

AP Elections: సిగ్గు, సంస్కారం వదిలేశారు.. జగన్‌పై షర్మిల సంచలన కామెంట్స్..

AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 27 , 2024 | 05:20 PM