AP Elections: వైసీపీ ఆశలన్నీ వాళ్లపైనే.. తేడా వస్తే ఫ్యాన్ ఫ్యూజులౌట్..
ABN , Publish Date - Apr 29 , 2024 | 02:22 PM
ఏపీలో వరుసగా రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలిసినా.. తాము గత ఐదేళ్లుగా అమలు చేసిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలే ఓట్లు తెచ్చిపెడతాయని వైసీపీ నాయకులు లెక్కలు వేస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అభివృద్ధిని పక్కనపెట్టి.. ఓట్ల కోసమే అన్నట్లు రాష్ట్రం లోటుబడ్జెట్లో ఉన్నప్పటికీ ఉచిత పథకాలను ప్రవేశపెట్టారు. దీంతో ఏపీ అప్పులమయమైంది.
ఏపీలో వరుసగా రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలిసినా.. తాము గత ఐదేళ్లుగా అమలు చేసిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలే ఓట్లు తెచ్చిపెడతాయని వైసీపీ నాయకులు లెక్కలు వేస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అభివృద్ధిని పక్కనపెట్టి.. ఓట్ల కోసమే అన్నట్లు రాష్ట్రం లోటుబడ్జెట్లో ఉన్నప్పటికీ ఉచిత పథకాలను ప్రవేశపెట్టారు. దీంతో ఏపీ అప్పులమయమైంది. మొదట్లో ఈ విషయం ప్రజలకు అర్థంకాలేదు. ఆ తరువాత లక్షల కోట్లు అప్పులు చేసి పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ప్రజలే ఆ పథకాలను వ్యతిరేకిస్తూ వస్తున్న పరిస్థితులు అక్కడక్కడ కనిపించాయి.
ఏపీలో వృద్ధులకు రూ.3వేల పెన్షన్.. మహిళలకు ప్రతి ఏటా ఆర్థిక సాయం, కుల వృత్తులకు ఆర్థిక సాయం వంటి పథకాలు తమకు ఓట్లు తెచ్చిపెడతాయని వైసీపీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. తాజాగా వైసీపీ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు సైతం జగన్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఓటర్లలో వృద్ధులు, మహిళలు, చేతి వృత్తుదారులు దాదాపు 50 శాతానికి పైగా ఉంటారు. వీరిలో పథకాలు పొందిన వారి శాతం దాదాపు 50 నుంచి 60 శాతం ఉండొచ్చు. ఈ ఉద్దేశంతోనే వైసీపీ తాము అధికారంలోకి వస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుందని లెక్కలు చెబుతున్నాయి. కానీ ఇటీవల కాలంలో వీరంతా కూటమి వైపు మొగ్గుచూపుతున్నారని పలు సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాలను బట్టి అర్థమవుతోంది.
అప్పులమయం..
వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేసినప్పటికీ.. విపరీతంగా అప్పులు తీసుకొచ్చిందనే విషయం ప్రజలందరికీ తెలిసింది. దీంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచన ఓటర్లలో మొదలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లోనూ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తామని వైసీపీ తన మేనిఫెస్టోలో తెలిపింది. మరోవైపు రాష్ట్రా ఆదాయాన్ని ఎలా పెంచుతాం.. పారిశ్రామికీకరణ వంటి విషయాలపై మేనిఫెస్టోలో పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ఇంకోసారి అధికారంలోకి వస్తే ఏపీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని, అప్పులపైనే ఆధారపడి పథకాలు అమలుచేస్తే రాష్ట్రం దివాళా తీయాల్సి వస్తుందనే ఆందోళన ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీంతో వైసీపీ ఆశించిన విధంగా వృద్ధులు, మహిళల ఓట్లు గంపగుత్తగా వైసీపీకి పడే ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది.
తేడా వస్తే..
వైసీపీ ఆశించినట్లు వృద్ధులు, మహిళల్లో ఎక్కువ శాతం ఓట్లు పడకపోతే మాత్రం కనీసం 30 నుంచి 40 స్థానాలు కూడా జగన్ పార్టీకి రావడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే వాలంటీర్లతో రాజీనామాలు చేయించి.. వారందరితో ఎన్నికల ప్రచారం చేయించడం ద్వారా వృద్ధులు, మహిళల ఓట్లను వేయించుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తుందట. ఈ ప్లాన్ వర్కౌట్ కాకపోతే మాత్రం ఎన్నికల్లో వైసీపీకి గట్టిదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్లాన్ ఫలిస్తుందా లేదా అనేది జూన్4న తేలనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News