Share News

సీఎంకాగానే మమ్మల్ని పక్కన పడేశారు

ABN , Publish Date - Oct 29 , 2024 | 03:59 AM

ఆస్తుల్లో వాటాల పంపిణీకి ఈడీ కేసులు, జప్తు కారణమనే వాదనను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భర్త అనిల్‌ కుమార్‌ తోసిపుచ్చారు.

సీఎంకాగానే మమ్మల్ని పక్కన పడేశారు
Brother Anil Kumar

న్యాయంగా దక్కాల్సిన వాటా ఎందుకు ఇవ్వరు?

ఈడీ జప్తులో ఉన్న ‘సాక్షి’ని వాడుకోవడం లేదా?

జగన్‌పై షర్మిల భర్త అనిల్‌ కుమార్‌ ధ్వజం


అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆస్తుల్లో వాటాల పంపిణీకి ఈడీ కేసులు, జప్తు కారణమనే వాదనను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భర్త అనిల్‌ కుమార్‌ తోసిపుచ్చారు. ఈడీ జప్తులో ఉన్న ‘సాక్షి’ని జగన్‌ ఉపయోగించుకోవడంలేదా అని ప్రశ్నించారు. షర్మిలకు న్యాయంగా రావాల్సిన వాటాను ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. బ్రదర్‌ అనిల్‌ ఒక టీవీ చానల్‌తో మాట్లాడుతూ ఈ అంశాలపై స్పందించారు.


ys sharmila-jagan.jpg


నలిగిపోతున్న విజయమ్మ

ఆస్తుల పంపకం విషయంలో ఎటూ చెప్పలేక విజయలక్ష్మి నలిగిపోతున్నారని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం షర్మిలకు ఏమిటని ప్రశ్నించారు. దాని వల్ల వచ్చే లాభమేమిటని అడిగారు. అప్పట్లో పాదయాత్ర చేయాలని షర్మిలను భారతి కోరారని చెప్పారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అందులోకి ఎవరూ రాకుండా జగన్‌ కట్టడి చేశారన్నారు.


ys-sharmila.jpg


పీకే చెప్పడంతోనే..

‘‘తెలంగాణలో పార్టీ పెట్టాలని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్‌ కిశోర్‌ షర్మిలకు సూచించారు. ఇదే విషయాన్ని జగన్‌ వద్ద ప్రస్తావిస్తే.. అక్కడ కేసీఆర్‌ ఉన్నారని, ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నందున అక్కడ పార్టీ పెట్టొద్దని షర్మిలతో అన్నారు. అప్పటి నుంచే విబేధాలు ఎక్కువయ్యాయి’’ అని అనిల్‌ చెప్పారు. జగన్‌ 2019 ఎన్నికల్లో గెలిచేదాకా ఒకలా... గెలిచాక మరోలా మారిపోయారన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక తమను జగన్‌ పక్కన పడేశారన్నారు. బీజేపీతో ‘దోస్తీ’ నేపథ్యంలో తనను క్రైస్తవ ప్రచారం చేయవద్దని జగన్‌ చెప్పారన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Oct 29 , 2024 | 07:13 AM